Saturday, February 4, 2023

దీపావళి పూజా విధానం* - *ప్రణవపీఠాధిపతి బహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు నుంచి*

 *దీపావళి పూజా విధానం* - *ప్రణవపీఠాధిపతి బహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు నుంచి*


*ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణపరమాత్మ నరకాసురుడ్ని వధించడం వలన నరకచతుర్ధశి అయింది.* 


*పరమపాపాత్ముడు నరకుడు నశించడం వల్ల జగత్తంతా ఆనందంతో ఆ మరునాడు అంటే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటారు.*

*బ్రహ్మ దేవుడు అమ్మవారిని లోకశ్రేయస్సుకోసం ప్రార్థించగా, ఏ ఇంటిలో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఆ ఇల్లు సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉంటాయని అమ్మవారు వరం ఇచ్చింది.*


*దీపావళి రోజు ఆవుపేడని తప్పకుండా గొబ్బేమ్మలుగా ఇళ్ళ ముందు పెట్టాలి.*


*దీపావళి రోజు అమ్మవారిని తామర పువ్వులు, ఎఱ్ఱకలువ పూలతో పూజించాలి.*


*ఈరోజు అమ్మవారిని మనస్పూర్తిగా అష్టోత్తరంతో, సహస్రనామాలతో లేదా శ్రీసూక్తంతో కుంకుమ పూజ చేయాలి.*


*అమ్మవారికి పూజలో ఈ రోజు మన దగ్గర ఉన్న ఆభరణాలు సమర్పించాలి.*


*పులిహోర, దధ్యన్నం, పాయసాన్నం ఈ రోజు అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి.* 


*అమ్మవారికి ఈ రోజు నాలుగు ప్రదక్షిణలు చేయాలి.*


*సాయంత్రం వేళ గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి.*


*దీపాలు తొమ్మిది లేక పద్దెనిమిది లేక ఇరవై ఏడు ఆవిధంగా పెట్టాలి.*


*గోంగూర కాడలు నూనెలో నానబెట్టి, కాడకి వత్తి కట్టుకుని దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అని అంటూ కింద కొట్టాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు, దృష్టి దోషాలు పోతాయి*


*రాత్రి తిరిగి ఇంటి గుమ్మం దగ్గర హారతి వెలిగించి, కళ్ళకు అద్దుకుని గుమ్మం బయట పారవేసి, కళ్ళు, కాళ్ళు కడుక్కోవాలి.*


*దీపావళి నాడు స్వయంపాకం దానం చేసేవాళ్ళు పితృదేవతల యెుక్క అనుగ్రహం పొందుతారు.*


*సూర్యోదయం నుంచి, సూర్యాస్తమయం లోపు గురు దర్శనము చేసుకోవడం మంచిది.*

No comments:

Post a Comment