Sunday, February 5, 2023

తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు*2023 February

 *తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు*2023 February 


ఆసరా పింఛన్లు 12,000 కోట్లు


దళిత బంధు 17, 700 కోట్లు


బీసీ సంక్షేమం 6,229 కోట్లు


గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు


కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు


బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు,


నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,


విద్యుత్ రంగం 12, 727 కోట్లు


ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.


ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు..


దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు


ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు..


గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు..


బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు..


వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు..


కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు..


షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు


పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు..


వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు..


విద్యా రంగానికి రూ.19,093 కోట్లు..


రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు..


హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు..


పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు..


రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు..


హోంశాఖకు రూ.9,599 కోట్లు..

మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు..


మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు..


రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు..


రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు..


కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు



2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు..


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు.


తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 రూ.2,90,396 కోట్లని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు హరీష్‌ రావు. అలాగే, బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, విద్యుత్ రంగం 12, 727 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు తెలంగాణ మంత్రి హరీష్‌ రావు.

పెన్షన్ తీసేసె హక్కు ఎవరిచ్చారు *ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మన జ్ఞానం పెరుగుతుంది.*

 పెన్షన్ తీసేసె హక్కు ఎవరిచ్చారు *ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మన జ్ఞానం పెరుగుతుంది.*

*ఇదీ భారతదేశ వ్యవస్థ!!*

 *మీరే చూడండి ....*

    సేకరణ:- పాల క పురుషోత్తం. 

1- ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలను కుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయ వచ్చు. 

కానీ అదే వ్యక్తి మాత్రం రెండు చోట్ల ఓటు వేయ లేరు.


2- ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు.

కానీ అదే వ్యక్తిరాజ కీయ నాయకుడు కావాలను కుంటే మాత్రం జైలులో ఉన్న ప్పుడు కూడా ఎన్నికల్లో పోటీచేయవచ్చు.


3-ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు,

కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడినా, ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, ప్రధాని లేదా రాష్ట్రపతి కూడా కావచ్చు


4- ఒక వ్యక్తి నిరాడంబర మైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 

కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ భారతదేశ ఆర్థిక లేదా విద్యా మంత్రి కావచ్చు.


5-ఒకవ్యక్తి సైన్యంలో చేరటానికి మేజర్ అయి ఉండాలి10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.

కానీ అదే వ్యక్తి నిరక్షరాస్యుడు, పిరికివాడు కుంటివాడు అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు.


6 ఒక వ్యక్తి వేలాది కేసులలో నిందితుడైన ప్పటికీ న్యాయ లేదా హోం మంత్రి కూడా కావచ్చు


ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా?

నాయకులు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండవద్దా?

కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావ డానికి మీమద్దతు ఇవ్వండి.


మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు ....

కాకపోతే, మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.


30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? 


కేవలం 5 సంవత్సరాలు కూడా  రాజకీయ పదవిలో లేకుండా పెన్షనా? 


ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్లా??


న్యాయం ఎక్కడ ఉంది ...?


శ్రీ డి. కె. శ్రీవాస్తవ

చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

బొంబాయి హైకోర్టు.

ముంబై .....

ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి తొలగించ వద్దు, ✊✊✊✊

తినకూడని పదార్థాలు : *వరి బియ్యం, గోధుమ, నాన్‌వెజ్, గుడ్లు, మైదా, టీ, కాఫీ, చక్కెర, (జెర్సీ) పాలు, ప్యాకేజ్డ్ మరియు జంక్ ఫుడ్స్, రిఫైన్డ్ నూనెలు, డ్రై ఫ్రూట్స్, సోయా, చాక్లెట్లు.

 తినకూడని పదార్థాలు :


*వరి బియ్యం, గోధుమ, నాన్‌వెజ్, గుడ్లు, మైదా, టీ, కాఫీ, చక్కెర, (జెర్సీ) పాలు, ప్యాకేజ్డ్ మరియు జంక్ ఫుడ్స్, రిఫైన్డ్ నూనెలు, డ్రై ఫ్రూట్స్, సోయా, చాక్లెట్లు.


తినవలసిన ఆహారం :


*మలబద్దకానికి కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ వేయించిన దానికంటే ఎక్కువ ఉడికించిన ఆహారాన్ని తీసుకోండి.


*నీరు మరియు ఫైబర్ అధికంగా ఉండే కాలానుగుణ సేంద్రీయంగా పెరిగిన పండ్లను తినాలి.


*రోజూ ఎక్కువగా గోరువెచ్చని నీరు త్రాగాలి.


*రాత్రి పడుకునే ముందు చెవిలో దూదిని పెట్టుకోవాలి.నేరుగా ఫ్యాన్ కింద నిద్రించరాదు.


*ఒక పెద్ద గిన్నెలో వేడి నీరు పోసి తలను టవల్ కప్పి ఉంచి ఆ వేడి నీటితో రోజుకు 3 లేదా 4సార్లు ఆవిరి పట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది.


*మెరుగైన రక్త ప్రసరణ కోసం చురుకైన నడక లేదా వ్యాయామం ప్రతిరోజూ చేయాలి.


 *ఎసి గదుల్లో ఉండడం మానుకోండి. ప్రకృతిలో సహజమైన వాతావరణానికి ప్రాధాన్యత ఇవ్వండి.


*రాత్రి భోజనం కచ్చితంగా 7 గంటల లోపు తినాలి. రాత్రి త్వరగా నిద్ర పోయి వేకువజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.


*ప్రతి అరగంటకు ఒక చిన్న కప్పు గోరు వెచ్చని నీరు త్రాగాలి.


* చిరు ధాన్యాలు ఒక్కోటి 2 రోజుల చొప్పున తీసుకోవాలి.

ఊదలు 

అరికలు 

కొర్రలు 

అండు కొర్రలు

సామలు  

*మీరు చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు.


*ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి

Acidity // Gastric // గ్యాస్ట్రిక్ // జీర్ణకోశమునకు సంబంధించిన // జీర్ణకోశ వ్యాధి

 Acidity // Gastric // గ్యాస్ట్రిక్ // జీర్ణకోశమునకు సంబంధించిన // జీర్ణకోశ వ్యాధి


బార్లీని ఒక స్పూన్ తీసుకుని బాయిల్ చేసి  మార్నింగ్ నైట్ తాగడం వల్ల గ్యాస్టిక్ సమస్య   తగ్గుతుంది. అదేవిధంగా ఓవర్ వెయిట్ ఉన్న వెయిట్ లాస్ అవుతారు.


రోజు ఒక కీరదోస తిన్నా కూడా గ్యాస్ట్రిక్ సమస్య తీరుతుంది.


రోజు ఉదయాన్నే పళ్ళు తోముకున్న తరువాత వేయించి పొడి చేసుకుని  జీలకర్ర  వాటర్ లో వేసి  మరిగించాలి తర్వాత ఆ నీటిని తాగి తినడం వలన కూడా గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.


ప్రతి ఉదయం, ఒక చెంచా పుదీనా రసం, అర టీస్పూన్ నిమ్మరసంతో పాటు ఒక చెంచా తేనె తీసుకోవాలి.

భోజనం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా ఇది తీసుకోవచ్చు.


*ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 1 గ్లాసు రాగిజావ తీసుకోవాలి.


*గ్లాసు మజ్జిగ లో 1 స్పూన్ సోంపు పొడి మరియు 1స్పూన్ వాము పొడి కలుపుకొని తీసుకోవాలి.


*చిన్న అల్లం ముక్క, సగం స్పూన్ మిరియాలు మరియు సగం స్పూన్ సోంపు గింజలు ఒక చిటికెడు ఉప్పు ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టి  వడ కట్టి తీసుకోవాలి.


*ప్రతీరోజు రెండు పూటలు భోజనం తరువాత 2 గ్రాముల పిపళ్ళ పొడిని, తగినంత తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే కడుపులో  మంట తగ్గుతుంది.


* కొద్దిగా పెరుగును తీసుకొని అందులో కీర దోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే కడుపులో ఏర్పడే మంటను తొలగిస్తుంది.


*అజీర్ణం మరియు ఆమ్లత్వం / గ్యాస్ట్రిక్ సమస్యలకు రాగులు ఎల్లప్పుడూ ఉత్తమమైన ఆహారం.

(రాగి జావ, రాగి సంగటి రోజు తీసుకోవాలి).


***పై వాటిలో మీకు అందుబాటులో ఉన్నవి వాడొచ్చు*****


*అన్నం(చిరుధాన్యాలు)/చపాతి (జొన్న,రాగులు ,సజ్జలు మాత్రమే)లోకి  కూరలు ఎక్కువగా తినాలి. 


*రెండు సార్లు భోజనం చేసి రాత్రి పూట కూరగాయలతో సలాడ్/ పండ్లు/రాగులు, సజ్జలు, జొన్నల తో చేసిన రొట్టెలు/ చిరుధాన్యాలతో చేసిన  గంజి, అంబలి తీసుకోవాలి. (


చిరు ధాన్యాలు వారానికి ఒక రకము చొప్పున తీసుకోవాలి.


ఊదలు 

అరికలు 

కొర్రలు 

అండు కొర్రలు

సామలు  


మీరు చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు. 


*రాత్రికి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలతో  చేసుకోవాలి. ( https://t.me/goodfoodhealthylife)


ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.


తినకూడని పదార్థాలు :


*వరి బియ్యం, గోధుమ, నాన్‌వెజ్, గుడ్లు, మైదా, టీ, కాఫీ, చక్కెర, (జెర్సీ) పాలు, ప్యాకేజ్డ్ మరియు జంక్ ఫుడ్స్, రిఫైన్డ్ నూనెలు, డ్రై ఫ్రూట్స్, సోయా, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తినకూడదు

మంచినీరు త్రాగడం* 👉జబ్బులు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మంచినీరు తగిన విధంగా తీసుకోవాలి...

 మిత్రులారా, పెద్దలారా,


అందరికీ శుభోదయం🙏


 *Dr ramchandra* గారి డైట్ షీట్ లో పాటించవలసిన

 *మొదటి నియమం* 


*మంచినీరు త్రాగడం*


👉జబ్బులు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మంచినీరు తగిన విధంగా తీసుకోవాలి...


మన శరీరంలో ఉన్న కోట్లాది కణాలలో పేరుకుపోయిన కెమికల్స్ ను శుభ్రపరచడంలోనూ,

మనం తీసుకున్న ఆహారాన్ని తగిన విధంగా జీర్ణం చేయడం లోనూ మంచినీరు ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది...


ఈ రెండు పనులు సరిగ్గా జరగకపోతే  

మన శరీరం అనేక జబ్బులకు కేంద్రంగా మారిపోతుంది.


అందుకని మనకి జబ్బులు తగ్గాలన్నా, ఆరోగ్యంగా మన శరీరం ఉండాలన్నా మంచినీరు తగిన విధంగా తీసుకోవాల్సిందే...


👉 *మంచినీరు తీసుకునే విధానం* 


1. ఉదయం లేవగానే రెండు గ్లాసులు త్రాగవలెను. గంట గ్యాప్ తర్వాత మరో రెండు గ్లాసులు నీళ్లు త్రాగవలెను...ఆ విధం గా ఉదయం లేవగానే గంట గాప్ లో *1 లీటర్* త్రాగవలెను.


2. ఉదయం టిఫిన్ చేసిన గంట తర్వాత నుండి, మధ్యాహ్నం భోజనం చేసే అరగంట ముందు వరకు ప్రతీ గంట కి గ్లాస్ (250ml)చొప్పున *1 లీటర్* నీళ్లు త్రాగవలేను...(మధ్యాహ్నం తినే అరగంట ముందు రెండు గ్లాసులు నీళ్లు త్రాగవలెను.)


3. Lunch చేసిన గంటన్నర తర్వాత నుండి 5 గంటలకి మధ్యలో ప్రతీ గంటకి గ్లాస్ చొప్పున *1 లీటర్* నీళ్లు త్రాగ వలెను ...


4. 5.30 గంటలకు (డిన్నర్ కి అర గంట ముందు) 2 గ్లాస్ ల వాటర్ త్రాగ వలెను ... *1/2 లీటర్* 


5. డిన్నర్ చేసిన గంట తర్వాత నిద్రపోయే ముందు వరకు మొత్తం గా 2 గ్లాస్ ల *1/2 లీటర్* నీళ్లు త్రాగవలెను...


👉 *కొన్ని సూచనలు:* 


A. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు త్రాగవలెను. మిగిలిన సందర్భాలలో నార్మల్ వాటర్ తాగవలెను.


B. 12 సంవత్సరాల లోపు వారు వాటర్ క్వాంటిటీ సగానికి తగ్గించి తీసుకోవలెను.


C. కిడ్నీ , గాల్ బ్లాడర్ లో stones వున్న వారు అదనం గా 1లీటర్ నీరు తీసుకోవాలి.


D. దగ్గు, జలుబు, ఆస్త్మా తో ఇబ్బంది పడుతున్నవారు గోరువెచ్చని నీరు తీసుకో వలెను...అలాగే ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 తర్వాత .... ప్రతీ అర గంటకి అర glass చొప్పున గోరు వెచ్చని నీరు త్రాగాలి...


E. Free motion కాని వారు కొన్ని రోజుల పాటు ఉదయం లేవగానే గంట గాప్ లో అదనం గా 1 లీటర్ వరకు తీసుకోవలెను...


F. కిడ్నీ లో creatinine ఎక్కువ గా వున్న వారు, లివర్ సిర్రోసిస్, క్యాన్సర్ పేషెంట్లు డాక్టర్ రామచంద్ర గారి సలహా మేరకు మాత్రమే వాటర్ తీసుకోవాలి...


👉 నీళ్లు త్రాగే విషయం లో చాలా మంది చేస్తున్న కొన్ని *పొరబాటులు* ...


1. పైన చెప్పిన విధంగా మంచినీరును మంచినీరు గా మాత్రమే తీసుకోవలెను.. వాటిలో ఇతరత్రా ఏమీ కలపరాదు... ఉదాహరణకు..తేనె నిమ్మకాయ రసం కలుపుకోవడం లేదా పసుపు కలుపుకోవడం జీలకర్ర ఇలాంటివి రెగ్యులర్గా తాగే వాటర్ లో కలపరాదు...విడి గా మీ ఇష్టం...


2. కూలింగ్ వాటర్(ఫ్రిడ్జ్ వాటర్) లేదా బాగా వేడిగా ఉన్న వాటర్ తాగరాదు..


3. ఏదైనా తింటున్నప్పుడు లేదా తిన్న వెంటనే నీళ్లు త్రాగరాదు...


4. మూత్రం పోయాల్సి వస్తుందని వాటర్ తాగకుండా ఉండడం అనేది సరి కాదు...


5. రోజుకి నాలుగు లీటర్లు తాగమన్నారు కదా అని ఉదయం 2 లీటర్లు, సాయంత్రం 2లీటర్లు ఒకేసారి ఇలా తాగడం చేయకూడదు...


6. నీరు ఎక్కువగా తాగిన తర్వాత మాత్రమే మోషన్ కి వెళ్లడం అనే అలవాటు చేసుకోకూడదు..


7. తప్పని పరిస్థితిలలో మినహా మినరల్ వాటర్ రోజూ తాగరాదు...


8. ఫ్లోరైడ్, సోడియం లేని బోరు వాటర్ గాని, పట్టణాలలో,గ్రామాలలో సరఫరా చేసే వాటరు గాని తాగడానికి ఆమోద యోగ్యమైనది....


9. దాహం వేస్తేనే నీళ్ళు త్రాగడం, అంతకుమించి తాగితే కిడ్నీలు పాడవుతాయనే అపోహ తొలగించుకోవాలి. 


10. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నీళ్లు తాగ కుండా వుండటం సరైనది కాదు....


పైన చెప్పిన సూచనలు, పొరబాట్లు గమనం లో వుంచుకొని మంచినీరు ని తగిన విధంగా తీసుకో గలరు.

 జబ్బులను జయించాలంటే, మొట్ట మొదటి అడుగు గా , గ్రూప్ లో వున్న వారందరూ మంచి నీరు నియమం పాటించండం, ఇతరుల చేత పాటించేలా చేయడం tద్వారా ఆరోగ్యం గా ఉండాలని కొరుకుంటున్నము

Saturday, February 4, 2023

పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తున్న భక్తులు జీవితాంతం శ్రేయస్సు సాధించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు

 పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తున్న భక్తులు జీవితాంతం శ్రేయస్సు సాధించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు


పద్మనాభ ద్వాదశి




పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజు పద్మనాభ ద్వాదశి జరుపుకుంటారు. విష్ణువును ఈ పవిత్రమైన రోజున అనంత పద్మనాభ పూజలు చేస్తారు. పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తున్న భక్తులు జీవితాంతం శ్రేయస్సు సాధించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.


పద్మనాభ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత:

పద్మనాభ ద్వాదశిని గమనించడం ఒక వ్యక్తి విముక్తి పొందటానికి సహాయపడుతుంది. విష్ణువు యొక్క బలమైన భక్తులు అనంత పద్మనాభంలోని ఏకాదశి మరియు ద్వాదశిపై పూజలు మోక్షాన్ని పొందటానికి సహాయపడతాయని నమ్ముతారు.


విష్ణువు మోక్షాన్ని పొందడంలో సహాయపడటంతో అత్యంత ప్రియమైన దేవుడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు ప్రాపంచిక ఆనందాల కోసం భక్తులు ఆయనను ప్రార్థిస్తారు.విష్ణువు యొక్క అనుచరులు ప్రపంచాన్ని త్యజించడాన్ని నమ్మరు. వారు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలని మరియు విష్ణువును ఆరాధించడం ద్వారా మరియు మంచి పనులు చేయడం ద్వారా స్వర్గానికి తమ మార్గాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారు.



వరహ పురాణంలో పద్మనాభ ద్వాదశి వ్రతం ప్రస్తావించబడింది. ద్వాదశి రోజు ఉదయం నుండి భక్తులు ఈ వ్రతాన్ని పరిశీలించి తమ కాఠిన్యాన్ని ప్రారంభిస్తారు.


కర్మ స్నానం చేసిన తరువాత భక్తులు విష్ణువు విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగించి భక్తులు విష్ణువుకు నీరు, పువ్వులు, బెట్టు ఆకులు, స్వీట్లు, పండ్లు, పసుపు, గంధపు పేస్టులను అందిస్తారు.


పువ్వులు మరియు లైట్లతో అందంగా విష్ణు ఆలయాన్ని అలంకరింపచేసి తరవాత స్వామిని సందర్శిస్తారు. దేవతలను అర్చించడం, గౌరవించడం, పూజించడం మొదలగునవి పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు.


చనిపోయిన ప్రియమైనవారికి నివాళులర్పించడానికి కూడా ఈ వేడుక చేయవచ్చు. భక్తులు విష్ణువుకు అంకితం చేసిన గ్రంథాలను చదువుతారు, ఆయన ప్రశంసలలో శ్లోకాలు పాడతారు మరియు రోజంతా ఆయన పేర్లతో మధ్యవర్తిత్వం చేస్తారు.


భక్తులు కూడా రాత్రి జాగరణ చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారు. ఆచారాలను ఉదయం మరియు రాత్రి రెండింటిలోనూ చేయవచ్చు. పేద ప్రజలకు భిక్ష మరియు ఆహారాన్ని అందిస్తారు.

ఒక మనిషిలో ఉండే ధనాత్మక ఋణాత్మక తత్వాల కలయికే అర్థనారీశ్వర తత్వం

 ఒక మనిషిలో ఉండే ధనాత్మక ఋణాత్మక తత్వాల కలయికే అర్థనారీశ్వర తత్వం


అర్థనారీశ్వర తత్వం




స్వరశాస్త్రం అర్థనారీశ్వర తత్వం - వైజ్ఞానిక విశ్లేషణ

మన భారతీయ శాస్త్రాలలో స్వర శాస్త్రం అనే శాస్త్రం ఉంది. చాలా మందికి స్వరశాస్త్రం అంటే సంగీత శాస్త్రం అనే అపోహ కూడా ఉంది. స్వర శాస్త్రం అంటే మనం పీల్చే గాలి మన శరీరంలో ఏఏ నాడుల మీద ఎలా పని చేస్తుందో తెలిపే శాస్త్రం. ఈ శాస్త్రం అంతా సాంకేతిక పదాలతో నిగూఢంగా ఉంటుంది.


స్వర సాధన అనుభవాల పుట్ట. తంత్ర సాధనలో స్వరసాధన చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. తంత్ర సాధకులు నిగూఢమైన పేర్లతో అవయవాలను పోల్చారు. మనం పీల్చేగాలిని బట్టి పేర్లు పెట్టారు.


కుడి వైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శివ, సూర్య, పగలు, యమున, పింగళ అని, ఎడమవైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శక్తి, చంద్ర, రాత్రి, గంగ అనే పేర్లు పెట్టారు. వీటిలో గాక ముక్కు రెండు రంద్రాలనుండి సమానంగా శ్వాస నడుస్తుంటే అగ్ని, సంధ్య, సరస్వతి, సుషుమ్న అని పెర్లు పెట్టారు.


ఇప్పుడు COD అందుబాటులో ఉంది



ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం. గురువు ద్వారా శిష్యులు నేర్చుకునే విజ్ఞానం. ఈ సాధనద్వారా సాధకులు అనేక అతీత శక్తులను పొందుతారని శాస్త్ర వచనం మరియూ ఆప్త వాక్యం.


ఈ శాస్త్రాన్ని అభ్యసించిన వారు మన తెలుగు నేలలో ముఖ్యంగా వేమన, పోతులూరి వీరబ్రహ్మం గారు, ఇంకా అనేక మంది పేరు సిద్ధులు. ఇంకా చాలామంది ఈ స్వరశాస్త్రాన్ని అభ్యసించిన మహానుభావులు తెలుగునాట ఉన్నారు. అనేక గ్రంథాలు తెలుగులో ఈ శాస్త్రం మీద వెలువడ్డాయి. కానీ మన దురదృష్టం కొద్ది అవి నేడు అలభ్యాలు. కొన్ని దుర్మార్గుల దండయాత్రలలో కాలి బూడిదయ్యాయి. కొన్ని ప్రజల నిర్లక్ష్యం వలన పోయాయి.


ఈ శాస్త్రానికి మూల పురుషుడు అర్థనారీశ్వరుడు. నేటి సైన్సు పరిభాషలో చెప్పాలంటే బ్రెయిన్ లో కుడి ఎడమ మెదడులు ఉన్నాయి. మస్తిష్కం మెదడులోని అన్నిభాగాలకన్నా పెద్దది. పుర్రెలో పైభాగమంతటినీ ఆక్రమించి ఉంటుంది. దీన్ని దైర్ఘ్య విదరము అనే రెండు అర్థచంద్రాకార భాగాలుగా విభాజితమై ఉంటుంది.


ఈ భాగాలను మెదడు గోళార్థాలు అంటారు. యోగులు ఈ భాగాలను సూర్య చంద్రులని అంటారు. న్యూరాలజిస్టులు ఆడ, మగ చర్యలకు ఎడమ, కుడి బ్రెయిన్ కు గల సమ సంబంధాన్ని తెలుసుకున్నారు. ఆడవారు ఎక్కువ ఎడమ గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు.


మగవారు ఎక్కువ కుడివైపు గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు. బ్రెయిన్లో గల సెక్స్ హార్మోన్లు తమ తమ తేడాకు కారణంగా సైన్స్ నిర్థారణ చేస్తుంది. దేహ ధర్మాలలో ఏ తేడా ఉన్నప్పటికీ, ఇడా తత్వం స్త్రీ ప్రధానంగాను, పింగళా తత్వం పురుష ప్రధానంగాను ఉన్నవి. ఈ తత్వమే అర్థనారీశ్వర తత్వం.


ఒక మనిషిలో ఉండే ధనాత్మక ఋణాత్మక తత్వాల కలయికే అర్థనారీశ్వర తత్వం. ఈ ప్రాతిపదికనే అర్థనారీశ్వర తత్వం ప్రతిపాదింప బడింది. పరమేశ్వరుడు కుడివైపు పురుషతత్వానికి (పింగళ), ఎడమవైపు పార్వతి, స్త్రీతత్త్వానికి (ఇడా)ప్రతిబింబాలు.

హనుమాన్ చాలీసా అంటే అర్థం ఏమిటి? హనుమంతుని పంచముఖములు ఏవి?

 హనుమాన్ చాలీసా అంటే అర్థం ఏమిటి? హనుమంతుని పంచముఖములు ఏవి?


హనుమాన్ చాలీసా




1. చాలీసా" అంటే ఏమిటి?

జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)


2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?

జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.


3.ఆంజనేయ - అర్థం?

జ. ఆంజనేయ అంటే. సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.


4.తులసీదాస్ అస్సలు పేరు ?

జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.


5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?

జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.


6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?

జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.


7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?

జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.


8.హనుమంతుని పంచముఖములు ఏవి?

జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము.దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.పశ్చిమం గరుడ ముఖం అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.ఉత్తరం వరాహ ముఖం అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య, త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం.


9."జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?

జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.


10.తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?

జ.126 సం.జీవించాడు.


11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు?

జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.


12.రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?

జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు. త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా, హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.


13.రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?

జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో.


14.సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?

జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు.


15. కపీశ అంటే అర్థం ఏమిటి?

జ. కపీశ అంటే.

a) కపులకు ఈశుడు

b) కపి రూపంలో ఉన్న ఈశుడు

C) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.


16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు. అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటారు


17.హనుమ రామదూత ఎలా అయ్యాడు ?

జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే


అగ్ని ముఖావై దేవాః.

దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు. అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు.


18.అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ?

జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం.


19.ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా?

జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వ

వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది బీజాక్షరాలు.....

 వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది


బీజాక్షరాలు.....




వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది. అది పఠించటము వలన సాధకునకు సకారాత్మక శక్తి(Positive energy) కలుగును. పఠించిన కొలది ఆ సకారాత్మక శక్తి క్రమ క్రమముగా వృక్షము మాదిరి వృద్ధి చెందుతుంది. బీజ మంత్రములు అనేవి స్పందనలు. ఆత్మ యొక్క పిలుపులు. సృష్టి ఆరంభములోని స్పందనలు బీజాక్షర మంత్రములే. తొమ్మిది శబ్దముల వరకు ఉన్నది బీజ మంత్రము, తొమ్మిదికి మించిన యడల మంత్రము అని, ఇరువది శబ్దములను మించిన మహా మంత్రము అని అంటారు.


అసలు సృష్టి ఆరంభములోని ప్రథమ స్పందన ‘ఓం’. అనగా ‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది. అవియే ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’ అనే బీజాక్షరములు. సంగీతములో కూడా ప్రథమముగా ఉన్నది ‘ఓం’ మాత్రమె. అది క్రమముగా ‘స’, ‘రి’, ‘గ’, ‘మ’, ‘ప’, ‘ద’, ‘ని’, గా ఉత్పత్తి చెందినది. వేణువు ఊదినప్పుడు వచ్చు మొదటి శబ్దము ‘ఓం’ మాత్రమె... యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజములుగా ఉత్పత్తి చెందినది.


ఓం...

‘ఓం’ మంత్రము త్రిమూర్తులు అనగా సృష్టి (బ్రహ్మ) లేదా ‘అ’ కారమునకు, స్థితి(విష్ణు) లేదా ‘ఉ’ కారమునకు, మరియు లయ (మహేశ్వర) లేదా ‘మ’ కారమునకు, లకు ప్రతీక. ‘అ’ కారము, ‘ఉ’ కారమునకు, మరియు ‘మ’ కారము మూడు కలిసినదే ఓం కారము.


‘అ’ కారము ఋగ్వేదమునకు,

‘ఉ’ కారము సామవేదమునకు,

‘మ’ కారము యజుర్వేదమునకు ప్రతీక.

సృష్టి (బ్రహ్మ), స్థితి(విష్ణు) మరియు లయ (మహేశ్వర) మూడింటిని కలిపి మాయ అంటారు.


క్రీం లేదా ధం లేదా క్షం లేదా లం...

ఇది కాళీ మాత మరియు కుబేర బీజాక్షరము. ఈ బీజాక్షర ఉచ్చారణ మూలాధార చక్రములో చేయవలయును. మూలాధార చక్రము పృథ్వీ తత్వమునకు ప్రతీక. తద్వారా ఇచ్ఛాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, బలము, అన్ని విధముల సఫలత, మరియు నకారాత్మక శక్తుల నుండి రక్షణ లభించును.



శ్రీం లేదా వం...

ఇది మహాలక్ష్మి బీజ మంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ స్వాధిష్ఠాన చక్రములో చేయవలయును. స్వాధిష్ఠాన చక్రము వరుణ తత్వమునకు ప్రతీక. తద్వారా క్రియాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, అంగములలో బలము, మూత్ర పిండములు, చర్మము వ్యాధుల నుండి రక్షణ, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి.


బీజాక్షరాలు వాటి వివరణ

బీజాక్షర సంకేతములు

ఓం - ప్రణవము సృష్టికి మూలం

హ్రీం - శక్తి లేక మాయా బీజం

ఈం - మహామాయ

ఐం - వాగ్బీజం

క్లీం - మన్మధ బీజం

సౌః - సౌభాగ్య బీజం

ఆం - పాశబీజం


క్రోం - అంకుశము

హ్రాం - సూర్య బీజం

సోం, సః - చంద్ర బీజం

లం - ఇంద్ర బీజం, పృథివీ బీజం

వం - వరుణ బీజం,జల బీజం


రం - అగ్ని బీజం

హం - ఆకాశ బీజం, యమ బీజం

యం - వాయు బీజం

శం -ఈశాన్య బీజం, శాంతి బీజం

షం , క్షం - నిరృతి బీజము


సం - సోమ (కుబేర) బీజము

జూం - మృత్యుంజయ, కాల భైరవ బీజం

భం - భైరవబీజం

శ్రీం - లక్ష్మీబీజం

హ్సౌ - ప్రాసాద , హయ గ్రీవబీజం


ఖేం - మారణబీజం

ఖట్ - సంహారబీజం

ఫట్ - అస్త్రబీజం

హుం - కవచబీజం వషట్ వశీకరణము బీజం


వౌషట్ - ఆవేశబీజం

ష్ట్రీo - యమబీజం

ధూం -ధూమావతిబీజం

క్రీం - కాళీబీజం

గం - గణపతిబీజం


*గ్లౌం వారాహి - గణపతిబీజం

ఘే - గణపతిబీజం

త్రీం -తారా బీజం

స్త్రీo - తారాబీజం

హూం - కూర్చము, క్రోధము, ధేనువు


బ్లూం - సమ్మోహనము

ద్రాం -ద్రావణ, దత్తాత్రేయ బీజం

ద్రీo - ఉద్దీపనం

దం - దత్తాత్రేయబీజం

అం - బ్రహ్మ బీజం


కం -బ్రహ్మబీజం

ఇం - నేత్రబీజం

ఉం - శ్రోత్రబీజం

హ్లీం - బగళాబీజం

గ్రీం - గణపతిబీజం


ఠ - స్థంభనము

హిలి - వశీకరణ, దేవతాభాషణం

కిలి కిలి - దేవతాభాషణం

చులు - బాధా నివారణ

హులు - బాధా నివారణ

సూర్య భగవానుడి ఈ 12 శక్తివంతమైన మంత్రాలు

 సూర్య భగవానుడి ఈ 12 శక్తివంతమైన మంత్రాలు


1. ఓం హామ్ మిత్రయా నమ:

మీరు మంచి ఆరోగ్యాన్ని పొందాలన్నా, మీ పని సామర్థ్యం పెరగాలన్నా మీరు సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి.


2. ఓం హ్రీం రవయే నమః

మీరు క్షయవ్యాధితో బాధపడుతున్నట్లయితే మరియు మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడాలంటే, అప్పుడు సూర్య భగవానుడి ముందు నిలబడి ఈ మంత్రాన్ని జపించండి. ఇది క్షయ మొదలైన వ్యాధులను నయం చేస్తుంది.


3. ఓం హూం సూర్యయా నమః

మానసిక ప్రశాంతత కోసం సూర్య భగవానుడి మంత్రాన్ని జపించాలి. దీనివల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయి.


4. ఓం హ్రీం బానవే నమః

మూత్రాశయ సంబంధిత సమస్యలకు ఈ మంత్రాన్ని పఠించవచ్చు.


5. ఓం హ్రోం ఖగే నమః

పురీషనాళానికి సంబంధించిన సమస్యలకు ఈ మంత్రాన్ని జపించాలి. దీనిని జపించడం వల్ల బుద్ధి వికాసం, శరీర బలం కూడా పెరుగుతుంది.


"

6. ఓం హామ్ పుషనే నమః

మీరు మీ బలాన్ని మరియు సహనాన్ని పెంచుకోవాలనుకుంటే, ఈ మంత్రాన్ని జపించండి. దీని కారణంగా మనిషి మనస్సు మతపరమైన పనులలో కూడా నిమగ్నమై ఉంటుంది.


7. ఓం హ్రీం హిరణ్యగర్భాయ నమః

విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్రం వల్ల ప్రయోజనం పొందుతారు. దీని జపం వల్ల శారీరక, మేధో మరియు మానసిక శక్తులు వృద్ధి చెందుతాయి.


8. ఓం మేరీచీ నమః

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎలాంటి వ్యాధులు దరిచేరవు.


9. ఓం ఆదిత్య నమః

ఈ మంత్రాన్ని పఠించడం వల్ల తెలివి తేటలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.


10. ఓం సావిత్రే నమః

ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వ్యక్తికి గౌరవం పెరుగుతుంది. దీనితో పాటు సూర్యభగవానుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. అంతే కాకుండా మనిషికి ఊహ శక్తి కూడా పెరుగుతుంది.


11. ఓం అర్కే నమః

మీరు వేదాల రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అంతే కాకుండా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు దృఢంగా మారుతుంది. జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.


12. ఓం భాస్కరాయై నమః

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శరీరం లోపల మరియు బాహ్యంగా శుభ్రంగా ఉంటుంది. అదే సమయంలో మనసు కూడా సంతోషంగా ఉంటుంది.


అదిత్యాయ నమో నమః

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజు పటించడం చాలా మంచిది

 ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజు పటించడం చాలా మంచిది


నక్షత్ర గాయత్రి




ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి.


1. అశ్విని

ఓం శ్వేతవర్ణై విద్మహే

సుధాకరాయై ధిమహి

తన్నో అశ్వినేన ప్రచోదయాత్


2. భరణి

ఓం కృష్ణవర్ణై విద్మహే

దండధరాయై ధిమహి

తన్నో భరణి:ప్రచోదయాత్


3. కృత్తికా

ఓం వణ్ణిదేహాయై విద్మహే

మహాతపాయై ధీమహి

తన్నో కృత్తికా ప్రచోదయాత్


4. రోహిణి

ప్రజావిరుధ్ధై చ విద్మహే

విశ్వరూపాయై ధీమహి

తన్నో రోహిణి ప్రచోదయాత్


5. మృగశిరా

ఓం శశిశేఖరాయ విద్మహే

మహారాజాయ ధిమహి

తన్నో మృగశిర:ప్రచోదయాత్


6. ఆరుద్ర

ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే

పశుం తనాయ ధిమహి

తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్


7. పునర్వసు

ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే

అదితి పుత్రాయ ధిమహి

తన్నో పునర్వసు ప్రచోదయాత్


8. పుష్యమి

ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే

మహాదిశాయాయ ధిమహి

తన్నో పుష్య:ప్రచోదయాత్


9. ఆశ్రేష(ఆశ్లేష)

ఓం సర్పరాజాయ విద్మహే

మహారోచకాయ ధిమహి

తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్


10. మఖ

ఓం మహా అనగాయ విద్మహే

పిత్రియాదేవాయ ధిమహి

తన్నో మఖ: ప్రచోదయాత్


11. పుబ్బ(పూర్వా ఫల్గుణి)

ఓం అరియంనాయ విద్మహే

పశుదేహాయ ధిమహి

తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్


12. ఉత్తర(ఉత్తర ఫల్గుణి)

మహాబకాయై విద్మహే

మహాశ్రేష్ఠాయై ధీమహి

తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్


13. హస్త

ఓం ప్రయచ్చతాయై విద్మహే

ప్రకృప్రణీతాయై ధీమహి

తన్నో హస్తా ప్రచోదయాత్


14. చిత్త

ఓం మహాదృష్టాయై విద్మహే

ప్రజారపాయై ధీమహి

తన్నో చైత్రా:ప్రచోదయాత్




కావలసిన వారు ఇక్కడ Click చేయండి

15. స్వాతి

ఓం కామసారాయై విద్మహే

మహాని ష్ఠాయై ధీమహి

తన్నో స్వాతి ప్రచోదయాత్


16. విశాఖ

ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే

మహాశ్రేష్ఠాయై చ ధీమహీ

తన్నో విశాఖ ప్రచోదయాత్


17. అనూరాధ

ఓం మిత్రదేయాయై విద్మహే

మహామిత్రాయ ధీమహి

తన్నో అనూరాధా ప్రచోదయాత్


18. జ్యేష్ట

ఓం జ్యేష్ఠాయై విద్మహే

మహాజ్యేష్ఠాయై ధీమహి

తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్


19. మూల

ఓం ప్రజాధిపాయై విద్మహే

మహాప్రజాధిపాయై ధీమహి

తన్నో మూలా ప్రచోదయాత్


20. పూర్వాషాఢ

ఓం సముద్ర కామాయై విద్మహే

మహాబీజితాయై ధిమహి

తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్


21. ఉత్తరాషాఢ

ఓం విశ్వేదేవాయ విద్మహే

మహాషాఢాయ ధిమహి

తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్


22. శ్రవణం

ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే

పుణ్యశ్లోకాయ ధీమహి

తన్నో శ్రవణ ప్రచోదయాత్


23. ధనిష్ఠా

ఓం అగ్రనాథాయ విద్మహే

వసూప్రితాయ ధీమహి

తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్


24. శతభిషం

ఓం భేషజాయ విద్మహే

వరుణదేహాయ ధీమహి

తన్నో శతభిషా ప్రచోదయాత్


25. పూర్వాభాద్ర

ఓం తేజస్కరాయ విద్మహే

అజరక పాదాయ ధీమహి

తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్


26. ఉత్తరాభాద్ర

ఓం అహిరబుధ్నాయ విద్మహే

ప్రతిష్ఠాపనాయ ధీమహి

తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్


27. రేవతి

ఓం విశ్వరూపాయ విద్మహే

పూష్ణ దేహాయ ధీమహి

తన్నో రేవతి ప్రచోదయాత్

మాఘ పూర్ణిమ ప్రత్యేకత*_

 *మాఘ పూర్ణిమ ప్రత్యేకత*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 5 న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.


చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.

కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి.

మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.

*"మా - అఘం''* అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.


*"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ*


*బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''*


*"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము  నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''*  అని అర్థం.


అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.


*☘మాఘం అమోఘం :☘*


మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. *"మా'' అంటే మహాలక్షీ. "ధనుడు''* అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని *"శ్రీపంచమి''* అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.


*"శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే*


*శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*


మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ *"శ్రీపంచమి''* నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు *"అక్షరభ్యాసం''* జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి *"రథసప్తమి''* పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని *"శివరాత్రి''* పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి *"భీష్మ ఏకాదశి''* పర్వదినం చేశాడు.


త్రిమతాచార్యులలో ఒకరైన *"మధ్వాచార్యుడు''* ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని *"మధ్వనవమి''* గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.

జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని *"కేతువు''* పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు *"మఖ''* నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి *"మాఘమాసం"* అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం .

 

*☘పితృయజ్ఞానికి ప్రాధాన్యత :☘*


మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు *"పైతృకాలకు''* ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని *"అర్ధోదయ పుణ్యకాలం''* అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం. 


*☘మాఘపూర్ణిమ - మహామాఘి :☘*


మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే *"మాఘమాసం''*. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం *"మాఘపూర్ణిమ''* నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను *"మహామాఘి''* అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ *"మాఘ పూర్ణిమ''* అత్యంత విశేషమైనది. ఈ *"మహామాఘి''* శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి. 


*☘సముద్ర స్నానం ఎందుకు చేయాలి?☘*


 *"నదీనాం సాగరో గతి:''*


సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. 

అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.

సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా *"ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ''* లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. *"స్నానం''* అంటే *"షవర్ బాత్''* చేయడమో , *"స్విమ్మింగ్ పూల్''* లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.


సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి *"నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి"* అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో *"మాఘ పూర్ణిమ''* స్నానం ముఖ్యమైనది.


సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ *"గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి''* నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం. 


*☘మాఘ పూర్ణిమ స్నానఫలం :☘*


1 . *ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*


2 . *బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.*


3 . *చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.*


4 . *సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


5 . *పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


6 . *సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


7 . *గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


8 . *ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.*


9 . *సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.*


ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ *"అంత్యపుష్కరిణీ స్నానాలు''* అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

 


*☘మాఘస్నానం చేస్తున్నప్పుడు :-☘*

    *"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*


*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*


*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*


*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''* 


అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే *"దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు''* అని అర్థం. 

ఆ తరువాత ...

*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*   


*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*


అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే *"ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక''* అని అర్థం.

ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబలములు (దుప్పటిలు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు *"నేతితో తిలహోమం''* చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.

 

*☘తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :☘*


నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.

శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే *"తిలలు''* ... అనగా నువ్వులు.

తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే , శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు , మూడువంతులు తిలలు కలిపి  శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.

మాఘపూర్ణిమనాడు *"తిల పాత్రదానము''* చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి -


*"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం*


*బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే''* అని సంకల్పించి -


*"దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద*


*తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''*


అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. 


*☘చివరగా ఓ మాట☘*


మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి *"పోటు''* ఎక్కువగా ఉంటుంది. *"పూర్ణిమ''* దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. 

జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.


*ఓం నమో భగవతే వాసుదేవయ* మంత్రాన్ని జపించడం మంచిది.


*☘️మాఘ పూర్ణిమ వ్రత కథ..☘️*


పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒక రోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీక దేవిని  16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీక దేవిని 16 రోజుల ఆరాదించడంతో కాళికా దేవి వారికి కనిపించింది. తల్లి కాళీక దేవి బ్రాహ్మణ భార్యకు  గర్భం పొందటానికి  వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది.


ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్ల , పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయండంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికా దేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికా దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను  కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు , కాబట్టి కాళికా దేవిని ఏమి చేయలేకపోయను. అప్పటి నుండి , పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా , ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి.

రేపు నాగుల చవితి_*

 *_రేపు నాగుల చవితి_*



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.* సర్పము అనగా కదిలేది , పాకేది.  *నాగములో *‘న , అగ’* ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని *‘నాగము’* అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది *‘కాలము’* కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా *‘కాలనాగు’* అని అంటారు. 


జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా *‘నాగం’*. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా *‘ఉరగముల’* మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.


కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం *కార్తీక శుద్ధ చవితినాడు*  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా *ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో*  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 


ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 


నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే *"నాగుపాము"* ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.


ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 


దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. *కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.*  ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి *" నీటిని"* ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా *" రైతు "* కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.


భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.

 కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.


దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.


వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం *‘నాగ పంచమి’*  పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో *‘కార్తీక శుద్ధ చవితి’నాడు* మనం *‘నాగుల చవితి’ని*  పర్వదినంగా ఆచరిస్తున్నాం.


పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !.


పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.


*‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’* అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.


పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 


*ఆధ్యాత్మిక యోగా పరంగా :-* ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను *' వెన్నుపాము'* అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో *"పాము"* ఆకారమువలెనే వుంటుందని *"యోగశాస్త్రం"* చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో *'సత్వగుణ'* సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు *' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు"* నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.


నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*


పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.


*”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి”* అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.


*నాగుల చవితి మంత్రం*

పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

అనంత

వాసుకి

శేష

పద్మ

కంబాల

కర్కోటకం

ఆశ్వతార

ధృతరాష్ట్ర

శంఖపాల

కలియా

తక్షక

పింగళ

ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.


*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .*


 *నడుము తొక్కితే నావాడు అనుకో* 

 *పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో* 

 *తోక తొక్కితే తోటి వాడు అనుకో* 

 *నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.* 


ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.


మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_


9849100044

ఈ రోజు త్రిలోచన గౌరీ వ్రతం*_




_*ఈ రోజు త్రిలోచన గౌరీ వ్రతం*_



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*కార్తీక మాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేసుకుంటారు.*


సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ

*వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥*


అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు.

వాక్కు అర్థము ఈ రెండింటినీ విడదీయలేరు.

వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు అర్థము లాంటివారేనని ఈ శ్లోక అర్ధం.


అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు.


ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి , అవ్యవస్థకు , అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతి నుండి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా శవమవుతుంది. ఈ విధంగా ప్రకృతి పురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం.


ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా ఉంటుంది , శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి.


కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత


*పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం*

*ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥* స్తోత్రం.


ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మథుడిని తన మూడో కంటి చేత దహనం చేసినవాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీ దేవిది కూడా. అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది.


అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే అందుకోసమే *కార్తీక మాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం* చేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులను పాటించాల్సి వస్తుంతుంది. అవేమిటో గమనిద్దాం. 


ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి.


*"మౌనం"* మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి.


*"స్నానం"* దేహాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఉభయ సంధ్యలలో చన్నిటి స్నానం చేయాలి.


*"ధ్యానం"* బుద్దిని శుద్ధి చేస్తుంది కావున నిరంతరం మనం ఏపని చేస్తున్న ధ్యానస్థితిలో ఉంటూ విధ్యుత్ ధర్మాలను నేరవేర్చుకోవాలి... 


*"దానం"* మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు, పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు. కావున దేని మీద నాది అని బ్రాంతి చెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సుకోరకు సహాయ పడాగలగాలి.


*"ఉపవాసం"* ఉండాలి దీని వలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది.


*"క్షమాపణ"* ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి తద్వార మానవ సంబంధాలను బలపరుస్తుంది.


నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి.


సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.


కరుగుతున్న కాలానికీ జరుగుతున్న సమయానికీ అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే *"మంచితనం"* అదే మనకు ఆభరణం.


మనిషిలో *"అహం"* తగ్గిన రోజు *"ఆప్యాయత"* అంటే అర్ధం అవుతుంది. *"గర్వం"* పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనే దేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించ గలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది. నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కరలేదు. సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం ఆస్థితికి రావడానికి కృషి చేయాలి.





భగినీ హస్త భోజనం_*

 *_రేపు భగినీ హస్త భోజనం_*



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*యమ ద్వితీయ దాని విశేష కథాంశం*



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️





కార్తీక శుద్ధ విదియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. *ఈ రోజును యమ ద్వితీయ , పుష్ప ద్వితీయ , కాంతి ద్వితీయ , భ్రాతృ విదియ* వంటి అనేక పేర్లతో పిలుస్తారు. యముడి చెల్లెలు యమున. అన్నను ఆమె ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రోజుల తరబడి ఆయనకు వీలుపడదు.


ఓ రోజున అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో వెళ్తాడు. అప్పుడు ఆ బాల భక్తుడు మహాశివుణ్ని శరణు వేడుకుంటాడు. స్వామి త్రిశూలం తీసుకుని యముడి వెంటపడటంతో , ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండివంటలతో విందు వడ్డిస్తుంది. భోజనం చేస్తున్నవారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్లిపోతాడు.


భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగినట్లవుతుంది. మరోవైపు , అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణనూ కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. ఆమెను ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి , ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగరాదని యమున కోరుతుంది. ఆయన పరమానంద భరితుడవుతాడు. *ఏటా కార్తీక శుద్ధ విదియనాడు* ఇంటికి వచ్చి , ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయమూ ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు.

*‘నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు , సోదరుడికి ఈరోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది’* అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు పొంది యముడు తిరిగి వెళ్తాడు.


యమునకు , యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే *‘యమ ద్వితీయ’* పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి *‘భగినీ హస్తభోజనం’గా* ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు - సోదరుడు ఆమెకు చీర , పసుపు , కుంకుమ , పూలు , పండ్లు , ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది. పలువురు నేడు చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తారు. అంతకుముందు *(కార్తిక శుద్ధ పాడ్యమి)* పూజలందుకున్న బలి ఇప్పుడు వీడ్కోలు పొంది , పాతాళానికి వెళ్తాడనీ విశ్వసిస్తారు.

ఇదే పర్వదినాన యముడితో పాటు చిత్రగుప్తుడు కూడా మహిళల పూజలందుకుంటాడు. ఈ రోజు చేసే దానధర్మాల కారణంగా విశేష పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదిన ప్రత్యేకతను స్మృతి కౌస్తుభం , చతుర్వర్గ చింతామణి , భవిష్య పురాణం వంటి గ్రంథాలు విపులీకరించాయి.

ఈ యాంత్రిక యుగంలో కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన , సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి , పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. ఆర్థిక బంధాల్ని ఆర్ద్రపూరితంగా మార్చేవి , అందరూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవడానికి వేదికగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే ! అనుబంధాలను గుర్తుచేసుకోవడమే కాక , రేపటి తరాలవారికి వీటి ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరమూ ఎంతో ఉంది.

ఇవన్నీ పెద్దలు ఆశించి ఉపదేశించినవి. వీటిని తు.చ. తప్పక ఆచరణకు తెచ్చినప్పుడే సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సుసాధ్యమవుతుంది !


అన్నా చెల్లెళ్ళ  పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ , ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకొంటాం… అదే *భగిని హస్త భోజనం.* ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి , వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. అందుకే దీనిని భగిని హస్త భోజనం అంటారు.


*ఎప్పుడు జరుపుకొంటారు*


ఈ పండగను

భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు. దీపావళి అయిన రెండో రోజు దీనిని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి , హారతి ఇచ్చి , మిఠాయిలు తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.


*భగిని హస్త భోజనం వెనుక కథ*


హిందూ పురాణాల ప్రకారం దీనిని యమ ద్వితీయ , భాయిదూజ్‌గా పిలుస్తారు. ఈ రోజున పురుషులు తమ సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయన్నది పురాణ ప్రవచనం. సూర్య భగవానుని కుమారుడు యముడు. ఆయన సోదరి యమి & యమున. ఈ ప్రత్యేక పర్వదినాన యముడు యమున ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో యమున తన సోదరునికి హారతి ఇచ్చి , నుదట తిలకం దిద్ది సాదరంగా లోనికి ఆహ్వానిస్తుంది. యమునికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వండి అన్నకి ఎంతో ప్రేమతో తినిపిస్తుంది. దీనికెంతో సంతోషించిన యుముడు ఆమెను వరం కోరుకోమనగా , ఏటా ఇదే విధంగా వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరుతుంది. అలాగే అంటూ యముడు వరమిస్తాడు. ఆ పర్వదినాన సోదరి చేతి వంట తిన్న వారికి అపమృత్యు భయం ఉండదని అభయమిస్తాడు. ఈ విధంగా దీపావళి తరవాత వచ్చే రెండో రోజును భగిని హస్తభోజనం పర్వదినంగా జరుపుకొంటారు. దీనితో పాటు ,  మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీ కృష్ణుడు నరకాసురున్ని వధించిన తరువాత నేరుగా తన సోదరైన సుభద్ర ఇంటికి వస్తాడు. అప్పుడు సుభద్ర కృష్ణుడికి హారతి ఇచ్చి , తిలకం దిద్ది లోనికి ఆహ్వానిస్తుంది. యుద్ధంలో అలసి వచ్చిన అన్నకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది.


*ఎలా చేసుకుంటారు*


ఉదయాన్నే సోదరులను ఇంటికి పిలిచి వారితో కలిసి దేవుణ్ని ప్రార్థించి , వారి నుదుటన తిలకం దిద్ది , హారతి ఇచ్చి , వారికి సోదరిమణులు తమ చేతితో వండిన ఆహార పదార్థాలను తినిపిస్తారు. హరియాణా , మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు.

- మహారాష్ట్రలో ఈ పండుగను *‘భయ్యా - దుజ్’* అని పిలుస్తారు.

- నేపాల్ ప్రాంతం లో *భాయి - టికా* అని పిలుస్తారు.

- పంజాబ్ ప్రాంతం లో ఈపండుగను *‘టిక్కా’* అని పిలుస్తారు.

దీపావళి పూజా విధానం* - *ప్రణవపీఠాధిపతి బహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు నుంచి*

 *దీపావళి పూజా విధానం* - *ప్రణవపీఠాధిపతి బహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు నుంచి*


*ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణపరమాత్మ నరకాసురుడ్ని వధించడం వలన నరకచతుర్ధశి అయింది.* 


*పరమపాపాత్ముడు నరకుడు నశించడం వల్ల జగత్తంతా ఆనందంతో ఆ మరునాడు అంటే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటారు.*

*బ్రహ్మ దేవుడు అమ్మవారిని లోకశ్రేయస్సుకోసం ప్రార్థించగా, ఏ ఇంటిలో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఆ ఇల్లు సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉంటాయని అమ్మవారు వరం ఇచ్చింది.*


*దీపావళి రోజు ఆవుపేడని తప్పకుండా గొబ్బేమ్మలుగా ఇళ్ళ ముందు పెట్టాలి.*


*దీపావళి రోజు అమ్మవారిని తామర పువ్వులు, ఎఱ్ఱకలువ పూలతో పూజించాలి.*


*ఈరోజు అమ్మవారిని మనస్పూర్తిగా అష్టోత్తరంతో, సహస్రనామాలతో లేదా శ్రీసూక్తంతో కుంకుమ పూజ చేయాలి.*


*అమ్మవారికి పూజలో ఈ రోజు మన దగ్గర ఉన్న ఆభరణాలు సమర్పించాలి.*


*పులిహోర, దధ్యన్నం, పాయసాన్నం ఈ రోజు అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి.* 


*అమ్మవారికి ఈ రోజు నాలుగు ప్రదక్షిణలు చేయాలి.*


*సాయంత్రం వేళ గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి.*


*దీపాలు తొమ్మిది లేక పద్దెనిమిది లేక ఇరవై ఏడు ఆవిధంగా పెట్టాలి.*


*గోంగూర కాడలు నూనెలో నానబెట్టి, కాడకి వత్తి కట్టుకుని దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అని అంటూ కింద కొట్టాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు, దృష్టి దోషాలు పోతాయి*


*రాత్రి తిరిగి ఇంటి గుమ్మం దగ్గర హారతి వెలిగించి, కళ్ళకు అద్దుకుని గుమ్మం బయట పారవేసి, కళ్ళు, కాళ్ళు కడుక్కోవాలి.*


*దీపావళి నాడు స్వయంపాకం దానం చేసేవాళ్ళు పితృదేవతల యెుక్క అనుగ్రహం పొందుతారు.*


*సూర్యోదయం నుంచి, సూర్యాస్తమయం లోపు గురు దర్శనము చేసుకోవడం మంచిది.*

కార్తీక మాసం... ఆకాశ‌దీపం... ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది, గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా?

 కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం... ఎందుకు వెలిగించాలి?!





కార్తీక మాసం... ఆకాశ‌దీపం...

ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది, గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా?


శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వేళాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.


తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు.


ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. ‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమతమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

పటిక బెల్లం లో మూడవవంతు! అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన

 పటిక బెల్లం లో మూడవవంతు!


అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన


ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.


ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు. అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.


రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు. ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.


ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.


ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదే మీ శిక్ష అన్నాడు.





పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు.


అద్భుతం!! మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గార్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు. అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.


ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ " అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు. సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ??.


నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బందియే !! అరుణా చలుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొండపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం .


అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా (సేకరణ)

తులసీ మండపాన్ని ఇంట్లో ఈ ప్రకారం ఏర్పాటు చేయాలిి.!

 తులసీ మండపాన్ని ఇంట్లో ఈ ప్రకారం ఏర్పాటు చేయాలిి.!


 శ్రీ మహాలక్ష్మీ దేవి నివసించే తులసీ మండపం తప్పకుండా అందరి ఇళ్ళల్లో ఉండి తీరాల్సిందే.


 ఇంటి ముంగిట నాలుగు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు గల తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.


 ఈ మండపాన్ని తూర్పు, ఉత్తర దిశల్లో ఉండేలా చూసుకోవాలి. మండపం మధ్య లో ముక్కోణపు ఆకారం వుండి తీరాలి.


 ఇందు లో దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక మండపం లో నాగులు నివసించే పుట్ట మట్టి తో లేదా ఏదైనా పవిత్రమైన ఆలయం నుంచి తెచ్చుకున్న మట్టి తో నింపాలి.


 వెదురు బూడిద, ఎండిన పేడ తో తయారైన భస్మాన్ని అందులో కలిపి తులసీ మొక్కను నాటుకోవాలి. తులసీ మండపానికి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసే విధంగా చూసుకోవాలి.


 కృష్ణ తులసీ అనే మొక్కను (రెండింటిని జంటగా) నాటుకోవడం మంచిది. పౌర్ణమి రోజు తో పాటు కార్తీక మాసం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశిల్లో తులసీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.


 తులసీ మండపం ఏర్పాటు చేయలేకపోతే.. 12 లేదా 16 ఇటుకలతో తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.


 12-16 ఇటుకలతో ఏర్పాటు చేసిన తులసీ మండపం లో తులసీ మొక్కను నాటి దీపమెలిగించి పూజలు చేయవచ్చు. 12-16 సంఖ్య లో ఏర్పాటు చేసుకున్న తులసీ మండపానికి 12 సంఖ్యలో చందనం, కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రతి రోజూ స్నానమాచరించి తులసీ మొక్కకు పుష్పాలు వుంచి.. కేశవా, నారాయణా, మాధవా, గోవిందా, విష్ణు, మధుసూదనా, వామనా. పద్మనాభా అంటూ స్మరించాలి.


 తమలపాకు పై విఘ్నేశ్వరుడిని చందనంతో పట్టిపెట్టి.. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.


 అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు పటా పంచలవు తాయి.

నేటి రాశిఫలాలు (29-10-2021)

 నేటి రాశిఫలాలు (29-10-2021)

మేషం: 

ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు ఇంటాబయటా ఊహించని వివాదాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.కొన్ని పనులలో శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.


వృషభం: 

దీర్ఘ కాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు, ఉద్యోగమున సమస్యలు నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది.


మిథునం: 

బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.


కర్కాటకం: 

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. 


సింహం: 

నూతన వ్యక్తుల పరిచయాలు లాభ సాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి.


కన్య: 

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి,వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 



కావలసిన వారు ఇక్కడ Click చేయండి

తుల: 

ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.


వృశ్చికం: 

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి ఉద్యోగమున నిరాశ తప్పదు. 


ధనుస్సు: 

ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరలతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.


మకరం: 

నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగ వాతవరణం ఉత్సాహంగా ఉంటుంది. 


కుంభం: 

ఇంటాబయటా అనుకూల వాతావరణం. ఉంటుంది.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.


మీనం: 

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.


మద్దాలి తిరుమల సత్య విజయకృష్ణ, సిద్ధాంతి


 

రోజువారీ తిధి, వార, నక్షత్ర పంచాంగం, రాశి ఫలాలు, పండుగ రోజులు, సెలవులు, శుభ ముహుర్తాలు,పురాణ ఇతిహాసాల కీలకమైన తేదీలు,నోటిఫికేషన్లు మరియు మరెన్నో ఈ ఉచిత నిత్ర తెలుగు క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింకును క్లిక్ చేయండి! https://goo.gl/mPSCqd

శ్రీకుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం పార్వతీపరమేశ్వరుల కుమారుడైన

 శ్రీకుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం 

పార్వతీపరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి మురుగన్, స్కంధ, కుమార, సదానన, షణ్ముఖ, శరవన మరియు గుహనామములతో కొలువబడుచు దేశవిధేశములండు అనేకఆలయములు ఉన్ననూ అందు ముప్పది ప్రముఖక్షేత్రములున్నవి. ఈక్షేత్రములందు పదిమురుగన్ ఆలయములు పళని మురుగన్ ఆలయం, కుంభకోణం స్వామిమాలై మురుగన్ ఆలయం, తిరుచెందూర్ మురుగన్ ఆలయం, త్రిపురకూర్ణం మురుగన్ ఆలయం, తిరుత్తణి మురుగన్ ఆలయం,మధురై పజముదిర్ చొలై మురుగన్ ఆలయం, మలేషియా దేశమునందు కల్లుమాలై ఆలయం, మలేషియా దేశమునందే పెనాంగ్ నందు దండయుధపాణి ఆలయం,శ్రీలంకనందు తొందైమన్నారులోకల సెల్వసన్నిధి మురుగన్ ఆలయం మరియు ఆస్త్రేలియాదేశములో సిడ్నీ పట్టణమునందుకల మురుగన్ ఆలయములు ప్రముఖమైనవి. రామేశ్వరం యాత్రనందు తమిళనాడు రాష్ట్రములో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు 1. తిరుపరన్ కుండ్రం, 2.తిరుచెందూర్, 3.పళని, 4.స్వామీమాలై, 5.ఆరుల్మిగు సోలైమలాల్. 6. తిరుత్తణి. దర్శించు అవకాశము లభించుటవిశేషము. దక్షంభారత దేశమునందు తమిళనాదునందలి సుబ్రహ్మణ్య లేదా మురుగన్ ఆలయములతోపాటుగా దక్షణ భారతదేశమునందే కర్నాటకనందు దక్షిణ కన్నడజిల్లాలోని సుబ్రమణ్య అను గ్రామములో సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయము విశిష్టత కలిగిఉన్నది. కార్తికేయుడిని ఇచ్చట సర్పదేవత సుబ్రమణ్యునిగా ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్యసర్పమైన వాసుకి మరియు ఇతరసర్పాలు సుబ్రమణ్యుస్వామి శరణుపొందాయని పురాణములందు తెలుపబడినది. 

మంగళూరు నుండి రైలు, బస్సు, ప్రయివేటు వాహనములద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈక్షేత్రమునుగతములో కుక్కే పట్టణమని పిలిచేడివారు. ఆదిశంకరాచార్యూలవారు కొన్నిరోజులు ఇక్కడగడిపినట్టు "శంకర విజయం" నందు తెలుపబడింది. శంకరాచార్యులవారి "సుబ్రమణ్య భుజంగప్రయత స్తోత్రం"లో ఈక్షేత్రాన్ని"భజే కుక్కేలింగం"గా ప్రస్తావించారు. స్కంధపురాణము సనాతకుమారసంహితనందు శ్రీసుబ్రమణ్యక్షేత్రంగురించి అద్భుతంగాఅభివర్ణించారు. కుమార పర్వతశ్రేణినుండి ఉద్బవించిన ధారానదిఒడ్డున ఈదివ్యక్షేత్రంఉన్నది. శ్రీక్షేత్రాన్నిదర్శించే యాత్రికులు కుమారధారనదినిదాటి ఆలయాన్ని చేరుకోవాలి. సుబ్రమణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర కుమారధారనదిలో స్నానంచేయుదురు. శ్రీ కుక్కేసుబ్రమణ్యస్వామి దివ్యక్షేత్రం కర్నాటక రాష్ట్రములోని సుందరమయిన భారతదేశమునకు పశ్చిమకనుమలలో మంగళూరు నుండి 105కి.మీ.దూరంలో దట్టమయిన పచ్చని అడవులతో సుప్రసిద్దమైన కుమారపర్వతం అనబడు పర్వతమునకు ముందుభాగమునఉంది. పర్వతారోహకులకు ఈపర్వతం ఎంతో ఇష్టమైనప్రదేశం. కుమారపర్వతం పడగవిప్పి పహారాకాస్తున్న ఆరుసర్పముల కాలనాగు (శేష పర్వతం) వలె అందంగాఉంటుంది. రమణీయప్రదేశంనడుమఉన్న సుబ్రమణ్య గ్రామములో కుక్కేసుబ్రమణ్య ఆలయం కొలువైఉంది. భారతదేశంలో ఇంతటి అందమైనప్రదేశాలు అరుదుగా ఉన్నాయి. దక్షిణ కర్ణాటకనందు దాదాపుగా ఇటువంటి అందమైన వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ అందమైన జలపాతాలు, అడవులు, కొండలతోఉన్న గ్రామముమధ్య ఆలయము. ఉండటము ఒకఅద్భుతము. 

ఆలయము వెనుకనుండి భక్తులు గుడిప్రాంగణాన్ని చేరుకుని మూలవిరాట్ నకు ప్రదిక్షిణలు చేస్తారు. మూలవిరాట్ ముఖద్వారానికి మధ్య గరుడస్తంభం వెండితాపడం చెయ్యబడిఉంటుంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం, ఆలయంలోపల నివాసమున్న వాసుకిఊపిరినుండి వెలువడు విషగాలులనుండి భక్తులను కాపాడటానికి ప్రతిష్ఠించబడిందనినమ్మెదరు స్తంభంమునకు సుబ్రమణ్య ఆలయమునకు మధ్య బాహ్యామందిరం, అంతరమందిరం కలవు.. గుడికి మధ్యలో పీఠంఉంది. పీఠంపైభాగంలో సుబ్రమణ్యస్వామి, వాసుకిలవిగ్రహాలు, కిందభాగంలో శేషనాగువిగ్రహం ఉన్నాయి. ఈవిగ్రహాలకు నిత్యకర్మ ఆరాధన పూజలుజరుగుతాయి. పవిత్రత, ప్రాముఖ్యతవలన ఈఆలయము దినదిన ప్రవర్ధమానంచెందుతూ చాలావేగంగా అభివృద్ధి, ప్రజధరణ పొందుతున్నది. పురాణకధల ప్రకారము షణ్ముఖప్రభువు తారక, శూరపద్మసురఅను రాక్షసులనువారి అనుచరుల సమేతంగా సంహరించి తనసోదరుడు గణేషుణితో కలిసి కుమారపర్వతాన్ని చేరుకుంటారు. వారికి అక్కడఇంద్రుడు గొప్పఆహ్వానం పలుకుతాడు. రాక్షససంహారంవల్ల చాలాసంతోషంతోఉన్న ఇంద్రుడు, కుమారస్వామిని తనకుమార్తె దేవసేనను వివాహముచేసుకొమ్మని అడిగాడు. అందుకు కుమారస్వామి అంగీకరించగా, వారివివాహం కుమారపర్వతం పైన మార్గశీర్షమాసం శుద్ధశష్టినాడు జరిగింధి.. ఆవివాహంతోజరిగిన షణ్ముఖ పట్టాభిశేఖానికి దేవదేవులు బ్రహ్మ,విష్ణు, శివుడుమొదలైన దేవతలుహాజరై ఆశీర్వదించారు. కార్యక్రమానికి ప్రసిద్థ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకన్ని నిర్వహించారు. అలా పుణ్యనదుల కలియకనుంచి ప్రవహించినధార కుమారధారగా పిలవబడుచున్నది. గరుడునిధాడినుంచి తప్పించుకోవటానికి సర్పరాజు వాసుకి కుక్కేసుబ్రమణ్యక్షేత్రములో శివునిగురించి తపస్సు చేశాడు..వాసుకి తపస్సుకుమెచ్చిన శివుడు, షణ్ముఖుడిని తనభక్తుడు వాసుకికిఅండగా, తోడుగా ఉండమని తెలిపాడు.. అందుకే ఇచ్చట వాసుకిఅనబడు నాగరాజుకుకానీ చేయు పూజలు సుబ్రమణ్యస్వామికి చేసినట్లీ. శ్రీక్షేత్రం కుక్కేసుబ్రమణ్యఆలయంలో ఆశ్లేషబలిపూజ అను కాలసర్పదోషపూజ నిర్వహిస్తారు. సుబ్రమణ్యస్వామి కాలసర్పదోషము, కుజదోషములనుండి భక్తులకు రక్షణఇస్తాడు. ఆశ్లేషబలిపూజ ప్రతినెల ఆశ్లేషనక్షత్ర దినాలలో జరపబడుతుంది. పూజకుహాజరయ్యే భక్తులు సమయానుసారం దేవస్థానంలోపల సంకల్పంచేసే పురోహీతుడి ముందు హాజరుకావలెను. హోమపూర్ణహుతి పిమ్మట భక్తులకు ప్రసాదాలు అందచేయబడుతాయి. శ్రావణ, కార్తీక, మృగశిర మాసముయందు భక్తులు ఈపూజ విశిష్టముగా చేస్తారు. సర్పదోషమునుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈపూజచేస్తారు. ఈజన్మలోకానీ లేక గతజన్మలోకానీ, తెలిసికానీ, తెలియకకానీ పలుకర్మల వలన సర్పదోష బాధితులయినవారికీ పండితులు ఈసర్పదోషనివారణ పూజను విముక్తిమార్గంగా సూచిస్తారు. ఈ పుజను వ్యక్తికానీ, కుటుంబంతోకానీ, లేక పూజారి ఆద్వర్యంలో కానీ చేయవచ్చును. ఈపూజావిధానం ఒకవ్యక్తి మరణానంతరం జరిగే శ్రార్ధఖర్మలపూజవలె ఉంటుంది. సర్పసంస్కార పూజ చెయ్యదలిచినవారు రెండురోజులు సుబ్రమణ్య సన్నిధిలో ఉండవలెను. ఈపూజ సూర్యోదయసమయంలో చెయ్యబడుతుంది. ఆరోజు వేరే ఎటువంటి పూజలు చెయ్యకూడదు. పూజప్రారంభం నుంచి ముగింపువరకు దేవస్థానంవారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమేభుజించాలి. నలుగురుకి దేవస్థానంవారు భోజన మేర్పాటు చేస్తారు. ఆలయము ఉదయం 7-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు తిరిగి 3-30 నుండి 8-30 వరకు తెరచియుండును. బసకు దేవస్థానమువారి వసతిగృహములు మధ్యతరహానుండి ఉన్నతశ్రేణివరకు లభ్యమగును.

ఏటి సూతకంలో నిత్యపూజ చెయాలా, వద్దా??

 ఏటి సూతకంలో నిత్యపూజ చెయాలా, వద్దా??





🌟 ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే ఓ వ్యక్తి కర్మ చేయవలసి ఉంటుందో అట్టి కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు.అంటే వ్యక్తి మరణాంతర కర్మ చేసే వ్యక్తి అంటే కొడుకు,కూతురు, పౌత్రులు లేదా బంధువులు ఎవరైనా సరే చనిపోయిన వారి శ్రాద్ధ కర్మ జరిపించే వారికి, అలాగే సాధారణంగా తల్లి లేదా తండ్రి వీళ్ళిద్దరిలో ఎవరైనా చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు శ్రాద్ధకర్మ నిర్వహించే కాలాన్ని ఏటి సూతకం అంటారు.


🌟 తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ జీవి అభ్యున్నతికి సంబంధించిన కర్మలు వారి కొడుకులు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తాడు దేవుడు. ఎందుకంటే పురుషునికి మనస్సులో ఆనంద భావం కలిగితే కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. మనస్సులో ఆనందభావం కలిగిన ప్రతిసారి ఆనంద ధాతువు కదిలినా, శరీరంలోని హృదయ స్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని.అలా కాకుండా శరీరంలో వేరే ఏ భాగం నుంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని శాస్త్రం, అందువలన ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్న వేదోక్తి ప్రకారం తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా భూమిమీద తిరుగుతుంది అని నమ్మకం.ఆ కొడుకుకి ఉన్న అధికారం/బాధ్యత ఏమిటంటే,జన్మనిచ్చిన తండ్రికి మరణాంతర కర్మ క్రియ చేయటం తన విధిగా భావించి చేయాలి, వాస్తవానికి జీవితంలో తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు కొడుకు.


🌟 అందికే "పుత్రగాత్ర పరిష్వంగము" ను మించిన సుఖం లేదన్నారు. కొడుకును కౌగలించుకుంటే తండ్రి ఎంత ఆనంద పడిపోతాడో!అది మాటల్లో చెపోటం అసాధ్యం, అటువంటి కొడుకును కన్నప్పుడు ఎంతో మురిసిపోతారు దంపతులు. అంటే కొడుకులు లేనటువంటి వారిని బెంగ పెట్టుకొమ్మని కాదు.


🌟 కొడుకులు లేకపోయినా కూతురు ఉండి కూతురుకి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే.కొడుకు ఉన్నవారికి మరణం పిమ్మట కూడా ఆ తండ్రి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం, కొడుకు శరీరంలో ఉన్న ఆత్మ తనదే కనుక భౌతికంగా లేక పోయినా ఉన్నట్టు భావించుతారు. ఓ వ్యక్తి శరీరం విడిచిపెట్టే ముందు తన కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీ పట్టణంలో విడిచిపెట్టేసినట్లే.అంటే కొడుకు ఒడి తండ్రికి అంత గొప్ప స్థానం అన్నమాట, అంటే తండ్రీ కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్నిచ్చింది శాస్త్రం.



👉👉 ఇప్పుడు COD అందుబాటులో ఉంది




కావలసిన వారు ఇక్కడ Click చేయండి !!


🌟 మరణ వేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని. అటువంటి తండ్రి తన కాయం విడిచి పెట్టేస్తే, మరి ఆ తండ్రికి మనం చేయవలసినది ఏమిటీ,మన కోసం ఆయన సమయం,ధనం,కష్టం సుఖం అన్నీ మనకోసమే వెచ్చించాడు మన చిన్నప్పటి నుంచి. అలాంటి కన్నతండ్రి శరీరం బడలి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరిగితే ఆ తండ్రికి ఎనలేని శాంతి లభిస్తుంది. అందుకే పెద్దలు ఒకే చూరు క్రింద తండ్రి కొడుకులు కలిసి ఉన్నవారు ఎవరో వారు మహద్భాగ్యవంతులు అన్నారు. రోజూ తన కళ్ళముందు తన కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినపడుతూ ఉంటే కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు అనే సంతోషం, నా వెంట వాడున్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్దాయం పెంచుతుంది.


🌟 కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. అలా కొడుకు కోసం తండ్రి వెంపర్లాడతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాదిపాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయాలి. అది కొడుకు యొక్క భాద్యత. ఏడాదిపాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తాడు దేవుడు. అందువల్ల వీడు వెళ్ళి అన్నదానం చేస్తే వారి నాన్నగారి ఖాతాలో వేస్తారు. పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. చేసిన వాడికి కూడా అంత కన్నా పుణ్యం లోకంలో ఇంకోటి లేదు. ఈశ్వర స్వరూపమైన తండ్రికోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకొకటి ఉండదు తండ్రీకొసం చేసే ప్రతీది ఈశ్వరునికి చేసినట్టే లెక్క.


🌟 అంతేకానీ కనపడ్డ ప్రతి వారితో నేను మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను, అని ప్రచారం చేసుకోవటం, నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు, ఏ వ్రతమూ చెయ్యట్లేదు అని బెంగ పెట్టుకోవడం కూడదు.అలా ఆలోచించటం కన్నా దుర్మార్గమైన తప్పు ఇంకొకటి ఉండదు. తండ్రికోసం విధిగా చేయాలి, అది కొడుకుల బాధ్యత,ఇంకా అవకాశం ఉంటే భూదానం,గోదానం,సువర్ణ దానం వంటివి చేయాలి.


🌟 అలా ఏడాదిపాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి లేదా తల్లి ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారు అంటారు. ఏటి సూతకంలో ఉంటే నిత్యపూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నాము, రోజూ చేసే పూజ చేయము అన్న మాట అనడానికి అధికారం లేదు. షోడశోపచారములు చేయాల్సిందే అధవా పంచోపచారములు అయినా జరిగి తీరాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు స్మశానం లాంటిది, దానిలో ఉండడానికి వీలులేదు. ఈశ్వరుడి పాదాల చెంత చక్కగా దీపం పెట్టవచ్చు. ఈశ్వరుడికి పూజ చేయవచ్చు. నైవేద్యం పెట్టవచ్చు. ప్రసాదం తినవచ్చు.


చేయకూడనివి:-


🌟 ప్రత్యేకంగా చేసే నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం నిషేధం, కానీ నిత్యపూజలో దంపతులు ఇద్దరూ కూర్చుని చేసినా దోషం ఏమీ ఉండదు. వ్రతాలు/పర్వదినాల్లో చేసే పూజలు మాత్రం ఆచరించకూడదు.


🌟 పీటల మీద కూర్చోవడం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆత్మీయుడు వెళ్ళిపోయాడే! కనీసం ఒక్క ఏడాది. ఈ పండుగకు మా అమ్మ/నాన్న జీవి యొక్క అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా పంచెల చాపు దానం చేసయండి. నాకు పండుగ అని తన సంతోషం కోసం చేసుకోకుండా సంతాపం ప్రకటించుకోవడం కోసమే పండుగ చేసుకోవద్దు అంటారు.


🌟 బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో చుట్టాలింటికి పంపి పెద్దలు మాత్రం బాధతో కూర్చోవటం ఎందుకది, ఎందుకా ఏటి సూతకం, అలా ఉండకూడదు. మనం మన పిల్లలకి నేర్పాలి. ఒరే బాబు మీ తాత, నాయనమ్మ అంత గొప్పవాళ్ళు. ఆ నాయనమ్మ, తాత వెళ్ళిపోయింది. అందుకని చేసుకోవడం లేదు. వారిని కోల్పోయిన దుఃఖం,వారికి సంతాపం ప్రకటించటం వలన తగ్గించుకుంటున్నాం, అని అర్థం అయ్యేలా చెప్తే మీరు మానేయండి మేం వెళ్తాం అంటారా పిల్లలు, అందుకే పండుగలు చేసుకోకండి, నోములు, వ్రతాలు, కొండలు ఎక్కకండి, ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి.


🌟 అంటే వేసవి కాలం వస్తే చలివేంద్రం పెట్టు. రోహిణీ కార్తెలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకుని పదిమందికి మజ్జిగ ఇయ్యి. దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వు. నియమం తప్పకుండా తల్లికి, తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏవిధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. అలా చేయడం ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించినది. దానిని ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో నిత్యపూజ చేయకూడదు అన్న నియమం లేదు. నిత్యపూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి.

అంబలప్పుళ శ్రీ కృష్ణ ఆలయం, కేరళ!! 🍃ప్రతి కృష్ణ భక్తుడు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా అంబలప్పుళ శ్రీ కృష్ణ

అంబలప్పుళ శ్రీ కృష్ణ ఆలయం, కేరళ!!

🍃ప్రతి కృష్ణ భక్తుడు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా అంబలప్పుళ శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఉన్న ఈ ఆలయం బియ్యం, పాలు మరియు చక్కెరను ఉపయోగించి తయారుచేసిన రుచికరమైన మిల్కీ గంజి 'అంబలప్పుజ పాల్పయసం' కు ప్రసిద్ధి చెందింది.

🍃ఈ అద్భుతమైన యాత్రికుల కేంద్రం 15-17 వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. నల్ల గ్రానైట్ రాయితో చెక్కబడిన పార్థసారథి, అంబలప్పుళ శ్రీ కృష్ణ దేవాలయం యొక్క ప్రధాన విగ్రహం. విగ్రహం ఎడమ చేతిలో పవిత్రమైన శంఖం మరియు కుడి చేతిలో కొరడా పట్టుకుని ఉంటుంది చాలా మంది హిందూ భక్తులు ప్రతిరోజూ ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసి రుచికరమైన పాల్పాయసం రుచి చూస్తారు.

🍃అంబలప్పుళ శ్రీ కృష్ణ దేవాలయానికి ప్రసిద్ధ గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. గురువాయూర్ ఆలయం నుండి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని 1789 లో టిప్పు సుల్తాన్ దాడుల సమయంలో అంబలప్పుళ ఆలయానికి తీసుకువచ్చి దాదాపు 12 సంవత్సరాలు ఈ పవిత్ర స్థలంలో ఉంచారు. గురువాయరప్పన్ ఈ ఆలయాన్ని ప్రతిరోజూ పల్పయసం అందించే సమయంలో సందర్శిస్తారని భక్తులు నమ్ముతారు.

🍃ఈ ఆలయం ఒట్టంతుల్లాల్‌తో సంబంధం కలిగి ఉంది, ఇది కేరళలో ప్రదర్శించిన గొప్ప కళ. మలయాళ కవి కుంజన్ నంబియార్ ఈ కళారూపాన్ని మొదట ఈ ఆలయ ప్రాంగణంలో పరిచయం చేశారు. ప్రతి సంవత్సరం మలయాళ మాసమైన మిధునం మూలం నక్షత్రంపై అంబలప్పుళ శ్రీ కృష్ణ దేవాలయం వార్షిక ఉత్సవం చంబకుళం మూలం నీటి ఉత్సవం నిర్వహిస్తారు.

🍃ఆరట్టు పండుగ యొక్క జెండా ఎగురవేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం మలయాళ యుగం (మార్చి-ఏప్రిల్) లో మీతం నెలలో అథం నక్షత్రంపై నిర్వహిస్తారు మరియు ఆరట్టు వేడుకలు మీనం యొక్క తిరువొనం నక్షత్రంపై జరుగుతాయి. పల్లిపన అనేది అంబలప్పుళ శ్రీ కృష్ణ దేవాలయం యొక్క మరొక ముఖ్యమైన పండుగ, దీనిని 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు మరియు కేరళలోని వేలన్స్ అనే సమాజం నిర్వహిస్తుంది.

🍃ఆలయ దర్శనం సమయం

🍃ఉదయం 4:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు

🍃ఎలా చేరుకోవాలి?

🍃అంబలప్పుళ శ్రీ కృష్ణ ఆలయం అలప్పుజ నుండి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

🍃సమీప విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఉంది.

🍃అలప్పుజ సమీప రైల్వే స్టేషన్. టూర్ మై ఇండియా కేరళకు ఆకర్షణీయమైన యాత్రికుల ప్రయాణ ప్యాకేజీలను అందిస్తుంది మరియు కేరళకు మన ఆధ్యాత్మిక పర్యటన ప్రయాణంలో తప్పక చూడవలసిన దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి.

దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు!! 1. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి - పిఠాపురం 🌟 దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..

దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు!!
1. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి - పిఠాపురం
🌟 దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..

2. కురువపురం
🌟 ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం... ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.

3. గోకర్ణము
🌟 ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం ... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.

🌟 దత్తావతారం..నృశింహ సరస్వతి.

4. కరంజా
🌟 రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం... ఇది మహరాష్ట్ర అమరావతి జిల్లాలో ఉన్నది.

5. నర్సో బావాడిన
🌟 శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,... ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది

6. గాణగా పూర్
🌟 శ్రీ గురుడు 23 సం నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీగురుని నిజపాదుకలు కలవు, చూడవలసి స్థలం, బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.

7. ఔదుంబర్‌
🌟 శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.

8. మీరజ్.
🌟 ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం. కొల్హాపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.

9. శ్రీశైలం
🌟 శ్రీ గురుడు అంతర్దానమైన ప్రదేశం.
ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంటారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.

🌟 దత్తావతారం.. మాణిక్య ప్రభువులు.

🌟 మాణిక్య నగర్

🌟 మూడవ దత్తావతారం, శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాధి, ప్రభువుల వారి సంస్ధానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది. తప్పక చూడవలసిన క్షేత్రము.

🌟 దత్తావతారం - అక్కల కోటస్వామి.

10. అక్కల్ కోట
🌟 నాలుగవ దత్తావతారం, స్వామిసమర్థ (అక్కల్ కోటస్వామి ) సమాదధి మందిరం ఇది చెన్నై - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు. తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.

దత్తావతారం. షిరిడి సాయిబాబా

11. షిరిడి
🌟 అయిదవ దత్తావతారం, సంపూర్ణ దత్త భగవానుని పూర్ణావతారం. సద్గురు షిరిడి సాయిబాబా సమాధి మందిరం. కోట్లాది భక్తులకు ఆరాధ్యుడు సద్గురువు బాబా.. షిరిడి మహరాష్ట్రలో ఉంది అన్నీ ప్రాంతాల నుం

పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి ఛాయతో ప్రకాశిస్తూ ఉంటారు

 పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి ఛాయతో ప్రకాశిస్తూ ఉంటారు


శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి వర్ణన స్తోత్రం!!



శ్రీ స్వర్ణ కాలభైరవ వర్ణన


స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాససం౹

స్వర్ణ పాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం౹౹


పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి ఛాయతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడిని ధరించి, చతుర్భుజాలతో వుండి, ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణభైరవుడు సిరి, సంపదలు ఇస్తాడు. 


కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం౹

ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం౹౹


అని శివరాత్రికి మనవూళ్ళో గుళ్ళోపాటతో కాలభైరవుడి పరిచయం అవుతుంది. కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడుగా కీర్తించబడ్డాడు. మంత్ర,తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తూ శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెపుతున్నాయి. అనేక దేవాలయాల్లో కాలభైరవ విగ్రహం వుంటుంది, ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా మనకి తెలుసు.


కాలమే జగన్మూలం. ఆ కాలరూపుడే కాలభైరవుడు. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలని అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యం. కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అనేక సంవత్సరాలు కాలభైరవాలయంలో సాధనచేసినట్లు ఆ పీఠంలో ఆ సమయంలో వున్న సాధకులు తెలిపారు.



కాలభైరవుడ్ని నేపాల్ ప్రాంతాల్లో, హిమాలయాల్లో ఎంతగానో పూజిస్తారు. ఖాట్మండు నగర మధ్యంలో వున్న కాలభైరవ మూర్తి చాలా దశాబ్దాలు నేపాల్ సుప్రీం కోర్టుగా పరిగణించబడేది. ఆ విగ్రహం ముందు ఎవరైన అబద్దం చెపితే సజీవులై వుండలేరని నమ్మకం. ఇటువంటిదే కానీపాకంలో వినాయకుని గురించి కూడా మనం వినవచ్చును. ఆధునికయుగంలోనూ కొన్ని కొన్ని విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన పేరుకి తగ్గట్టు ధన సమృద్ధిని, ఋణ విముక్తిని ఇస్తాడు. అన్నిటికన్న ముఖ్యం జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత సన్నిహితుడు, కారకుడు. 


శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్తోత్రం


ఓం అస్య శ్రీ స్వర్ణాఽకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య౹ బ్రహ్మ ఋషిః౹ అనుష్టుప్ ఛందః౹ శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా౹ హ్రీం బీజం౹ క్లీం శక్తిః౹ సః కీలకం౹ మమ దారిద్ర్య నాశార్థే వినియొగః౹౹


ఋష్యాది న్యాసః

బ్రహ్మర్షయే నమః శిరసి|

అనుష్టుప్ ఛందసే నమః ముఖే|

స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది |

హ్రీం బీజాయ నమః గుహ్యే|

క్లీం శక్తయే నమః పాదయోః|

సః కీలకాయ నమః నాభౌ|

వినియొగాయ నమః సర్వాంగే|

హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః||


ధ్యానం 

పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే౹

సింహాసన గతం వందే భైరవం స్వర్ణదాయకం౹౹


గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం౹

వరం కరః సందధతం త్రినేత్రం

దేవ్యాయుతం తప్త స్వర్ణవర్ణ

స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి౹౹


మంత్రః 

ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం౹ ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలవధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం౹౹ 


స్తోత్రం 

ఓం నమస్తే భైరవాయ బ్రహ్మ విష్ణు శివాత్మనే|

నమః త్రైలోక్య వంద్యాయ వరదాయ వరాత్మనే || ౧ ||


రత్నసింహాసనస్థాయ దివ్యాభరణ శోభినే |

దివ్యమాల్య విభూషాయ నమస్తే దివ్యమూర్తయే || ౨ ||


నమస్తే అనేక హస్తాయ అనేక శిరసే నమః |

నమస్తే అనేక నేత్రాయ అనేక విభవే నమః || ౩ ||


నమస్తే అనేక కంఠాయ అనేకాంశాయ తే నమః |

నమస్తే అనేక పార్శ్వాయ నమస్తే దివ్య తేజసే || ౪ ||


అనేకాఽయుధయుక్తాయ అనేక సురసేవినే |

అనేక గుణయుక్తాయ మహాదేవాయ తే నమః || ౫ ||


నమో దారిద్ర్యకాలాయ మహాసంపత్ప్రదాయినే |

శ్రీ భైరవీ సంయుక్తాయ త్రిలోకేశాయ తే నమః || ౬ ||


దిగంబర నమస్తుభ్యం దివ్యాంగాయ నమో నమః |

నమోఽస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః || ౭ ||


సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్య చక్షుషే |

అజితాయ నమస్తుభ్యం జితమిత్రాయ తే నమః || ౮ ||


నమస్తే రుద్రరూపాయ మహావీరాయ తే నమః |

నమోఽస్త్వనంత వీర్యాయ మహాఘోరాయ తే నమః || ౯ ||


నమస్తే ఘోర ఘోరాయ విశ్వఘోరాయ తే నమః |

నమః ఉగ్రాయ శాంతాయ భక్తానాం శాంతిదాయినే || ౧౦ ||


గురవే సర్వలోకానాం నమః ప్రణవ రూపిణే |

నమస్తే వాగ్భవాఖ్యాయ దీర్ఘకామాయ తే నమః || ౧౧ ||


నమస్తే కామరాజాయ యొషిత కామాయ తే నమః |

దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాయ తే నమః || ౧౨ ||



సృష్టిమాయా స్వరూపాయ నిసర్గ సమయాయ తే |

సురలోక సుపూజ్యాయ ఆపదుద్ధారణాయ చ || ౧౩ ||


నమో నమో భైరవాయ మహాదారిద్ర్యనాశినే |

ఉన్మూలనే కర్మఠాయ అలక్ష్మ్యాః సర్వదా నమః || ౧౪ ||


నమో అజామలవధ్యాయ నమో లోకేష్వరాయ తే |

స్వర్ణాఽకర్షణ శీలాయ భైరవాయ నమో నమః || ౧౫ ||


మమ దారిద్ర్య విద్వేషణాయ లక్ష్యాయ తే నమః |

నమో లోకత్రయేశాయ స్వానంద నిహితాయ తే || ౧౬ ||

నమః శ్రీ బీజరూపాయ సర్వకామప్రదాయినే |

నమో మహాభైరవాయ శ్రీ భైరవ నమో నమః || ౧౭ ||


ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః |

నమః ప్రసన్న (రూపాయ) ఆదిదేవాయ తే నమః || ౧౮ ||


నమస్తే మంత్రరూపాయ నమస్తే మంత్రరూపిణే |

నమస్తే స్వర్ణరూపాయ సువర్ణాయ నమో నమః || ౧౯ ||


నమః సువర్ణవర్ణాయ మహాపుణ్యాయ తే నమః |

నమః శుద్ధాయ బుద్ధాయ నమః సంసార తారిణే || ౨౦ ||


నమో దేవాయ గుహ్యాయ ప్రచలాయ నమో నమః |

నమస్తే బాలరూపాయ పరేషాం బలనాశినే || ౨౧ ||


నమస్తే స్వర్ణసంస్థాయ నమో భూతలవాసినే |

నమః పాతాళవాసాయ అనాధారాయ తే నమః || ౨౨ ||


నమో నమస్తే శాంతాయ అనంతాయ నమో నమః |

ద్విభుజాయ నమస్తుభ్యం భుజత్రయ సుశోభినే || ౨౩ ||


నమోఽణిమాది సిద్ధాయ స్వర్ణ

మన దేశంలో కొలువైయున్న 108 వైష్ణవ దివ్య క్షేత్రముల ప్రదేశములు 108 దివ్య క్షేత్రములు

 మన దేశంలో కొలువైయున్న 108 వైష్ణవ దివ్య క్షేత్రముల ప్రదేశములు


108 దివ్య క్షేత్రములు



108 వైష్ణవ దివ్య ప్రదేశములు

01. శ్రీరంగం

02. ఉరైయూర్ 

03. తంజమా మణిక్కోయిల్ 

04. తిరువన్బిల్ 

05. కరంబనూర్ 

06. తిరువెళ్లరై 

07. పుళ్ళం పూదంగుడి 

08. తిరుప్పేర్ నగర్ 

09. ఆదనూర్ 

10. తిరువళందూర్


11. శిరుపులియూర్

12. తిరుచ్చేరై 

13. తలైచ్చంగణాన్మదియం

14. తిరుక్కుడందై 

15. తిరుక్కండియూర్ 

16. తిరువిణ్ణగర్

17 తిరువాలి తిరునగరి

18. తిరుకన్నాపురం

19. తిరునాగై 

20. తిరునరైయూర్


21. తిరునందిపురం

22. తిరువిందళూరు 

23. తిరుచిత్రకూటం 

24. శ్రీరామవిణ్ణగర్

25. కూడలూర్ 

26. తిరుక్కణ్ణంగుడి

27. తిరుక్కణ్ణ మంగై 

28. కపిస్థలం

29. తిరువెళ్లియం గుడి

30. తిరుమణి మాడక్కోయిల్ 


31. వైకుంఠ విణ్ణగరం

32. తిరుఅరిమేయ విణ్ణంగరం 

33. తిరుత్తేవనార్ తొగై 

34. తిరువణ్ పురుషోత్తమం 

35. తిరుశెంపొన్ శెయ్ కోయిల్

36. తితుతైత్తియంబలం

37. తిరుమణిక్కూడం

38. తిరుక్కావళంపాడి

39. తిరువెళ్లక్కుళం 

40. తిరుపార్తాన్ పళ్ళి 


41. తిరుమాలిరుం శోలైమలై

42. తిరుక్కోటియూర్

43. తిరుమెయ్యం 

44. తిరుప్పల్లాణి 

45. తిరుత్తంగాల్ 

46. తిరుమోగూర్ 

47. తెన్ మధురై

48. శ్రీ విల్లిపుత్తూరు 

49. తిరుక్కురు గూర్ 

50. తిరుతులై విల్లి మంగళం



51. శిరీవర మంగై

52. తిరుప్పళింగుడి

53. తెన్ తిరుప్పేర్ 

54. శ్రీ వైకుంఠం 

55. తిరువరగుణ మంగై

56. తిరుక్కళందై

57. తిరుక్కురుం గుడి 

58. తిరుక్కోళూరు

59. తిరువనంతపురం

60. తిరువణ్ పరిశరాం 


61. తిరుకాట్కరై

62. తిరుమూరీక్కళం 

63. తిరుప్పలియూర్ 

64. తిరుచిత్తార్ 

65. తిరునావాయ్ 

66. తిరువల్లవాళ్ 

67. తిరువణ్ వండూరు

68. తిరువాట్టర్

69. తిరువిత్తు వక్కోడు

70. తిరుక్కడిత్తానం


71. తిరువారన్ విళై

72. తిరువహింద్ర పురం

73. తిరుక్కోవలూర్ 

74. పెరుమాళ్ కోయిల్

75. శ్రీ అష్టభుజం

76. తిరుత్తణ్ కా

77. తిరువేళుక్కై 

78. తిరుప్పాడగం 

79. తిరునీరగం 

80. తిరునిలాత్తింగళ్ తుండం 


81. తిరువూరగం

82. తిరువెక్కా

83. తిరుక్కారగం

84. తిరుకార్వానం 

85. తిరుక్కల్వనూర్ 

86. తిరుపవళ వణ్ణం 

87. పరమేశ్వరవిణ్ణగరం

88. తిరుప్పళ్ కుళి 

89. తిరునిర్రవూర్ 

90. తిరువెవ్వుళూరు 


91. తిరునీర్మలై

92. తిరువిడ వెండై

93. తిరుక్కడల్ మల్లై 

94. తిరువల్లిక్కేణి 

95. తిరుఘటిగై 

96. తిరుమల

97. అహోబిలం 

98. అయోధ్య 

99. నైమిశారణ్యం 

100. సాలగ్రామం


101. బదరికాశ్రమం

102. కండమెన్రుం కడినగర్ 

103. తిరుప్పిరిది 

104. ద్వారక 

105. బృందావనం 

106. గోకులం

107. క్షీరాబ్ది 

108. పరమపదం.