Saturday, February 4, 2023

శ్రీకుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం పార్వతీపరమేశ్వరుల కుమారుడైన

 శ్రీకుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం 

పార్వతీపరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి మురుగన్, స్కంధ, కుమార, సదానన, షణ్ముఖ, శరవన మరియు గుహనామములతో కొలువబడుచు దేశవిధేశములండు అనేకఆలయములు ఉన్ననూ అందు ముప్పది ప్రముఖక్షేత్రములున్నవి. ఈక్షేత్రములందు పదిమురుగన్ ఆలయములు పళని మురుగన్ ఆలయం, కుంభకోణం స్వామిమాలై మురుగన్ ఆలయం, తిరుచెందూర్ మురుగన్ ఆలయం, త్రిపురకూర్ణం మురుగన్ ఆలయం, తిరుత్తణి మురుగన్ ఆలయం,మధురై పజముదిర్ చొలై మురుగన్ ఆలయం, మలేషియా దేశమునందు కల్లుమాలై ఆలయం, మలేషియా దేశమునందే పెనాంగ్ నందు దండయుధపాణి ఆలయం,శ్రీలంకనందు తొందైమన్నారులోకల సెల్వసన్నిధి మురుగన్ ఆలయం మరియు ఆస్త్రేలియాదేశములో సిడ్నీ పట్టణమునందుకల మురుగన్ ఆలయములు ప్రముఖమైనవి. రామేశ్వరం యాత్రనందు తమిళనాడు రాష్ట్రములో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు 1. తిరుపరన్ కుండ్రం, 2.తిరుచెందూర్, 3.పళని, 4.స్వామీమాలై, 5.ఆరుల్మిగు సోలైమలాల్. 6. తిరుత్తణి. దర్శించు అవకాశము లభించుటవిశేషము. దక్షంభారత దేశమునందు తమిళనాదునందలి సుబ్రహ్మణ్య లేదా మురుగన్ ఆలయములతోపాటుగా దక్షణ భారతదేశమునందే కర్నాటకనందు దక్షిణ కన్నడజిల్లాలోని సుబ్రమణ్య అను గ్రామములో సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయము విశిష్టత కలిగిఉన్నది. కార్తికేయుడిని ఇచ్చట సర్పదేవత సుబ్రమణ్యునిగా ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్యసర్పమైన వాసుకి మరియు ఇతరసర్పాలు సుబ్రమణ్యుస్వామి శరణుపొందాయని పురాణములందు తెలుపబడినది. 

మంగళూరు నుండి రైలు, బస్సు, ప్రయివేటు వాహనములద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈక్షేత్రమునుగతములో కుక్కే పట్టణమని పిలిచేడివారు. ఆదిశంకరాచార్యూలవారు కొన్నిరోజులు ఇక్కడగడిపినట్టు "శంకర విజయం" నందు తెలుపబడింది. శంకరాచార్యులవారి "సుబ్రమణ్య భుజంగప్రయత స్తోత్రం"లో ఈక్షేత్రాన్ని"భజే కుక్కేలింగం"గా ప్రస్తావించారు. స్కంధపురాణము సనాతకుమారసంహితనందు శ్రీసుబ్రమణ్యక్షేత్రంగురించి అద్భుతంగాఅభివర్ణించారు. కుమార పర్వతశ్రేణినుండి ఉద్బవించిన ధారానదిఒడ్డున ఈదివ్యక్షేత్రంఉన్నది. శ్రీక్షేత్రాన్నిదర్శించే యాత్రికులు కుమారధారనదినిదాటి ఆలయాన్ని చేరుకోవాలి. సుబ్రమణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర కుమారధారనదిలో స్నానంచేయుదురు. శ్రీ కుక్కేసుబ్రమణ్యస్వామి దివ్యక్షేత్రం కర్నాటక రాష్ట్రములోని సుందరమయిన భారతదేశమునకు పశ్చిమకనుమలలో మంగళూరు నుండి 105కి.మీ.దూరంలో దట్టమయిన పచ్చని అడవులతో సుప్రసిద్దమైన కుమారపర్వతం అనబడు పర్వతమునకు ముందుభాగమునఉంది. పర్వతారోహకులకు ఈపర్వతం ఎంతో ఇష్టమైనప్రదేశం. కుమారపర్వతం పడగవిప్పి పహారాకాస్తున్న ఆరుసర్పముల కాలనాగు (శేష పర్వతం) వలె అందంగాఉంటుంది. రమణీయప్రదేశంనడుమఉన్న సుబ్రమణ్య గ్రామములో కుక్కేసుబ్రమణ్య ఆలయం కొలువైఉంది. భారతదేశంలో ఇంతటి అందమైనప్రదేశాలు అరుదుగా ఉన్నాయి. దక్షిణ కర్ణాటకనందు దాదాపుగా ఇటువంటి అందమైన వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ అందమైన జలపాతాలు, అడవులు, కొండలతోఉన్న గ్రామముమధ్య ఆలయము. ఉండటము ఒకఅద్భుతము. 

ఆలయము వెనుకనుండి భక్తులు గుడిప్రాంగణాన్ని చేరుకుని మూలవిరాట్ నకు ప్రదిక్షిణలు చేస్తారు. మూలవిరాట్ ముఖద్వారానికి మధ్య గరుడస్తంభం వెండితాపడం చెయ్యబడిఉంటుంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం, ఆలయంలోపల నివాసమున్న వాసుకిఊపిరినుండి వెలువడు విషగాలులనుండి భక్తులను కాపాడటానికి ప్రతిష్ఠించబడిందనినమ్మెదరు స్తంభంమునకు సుబ్రమణ్య ఆలయమునకు మధ్య బాహ్యామందిరం, అంతరమందిరం కలవు.. గుడికి మధ్యలో పీఠంఉంది. పీఠంపైభాగంలో సుబ్రమణ్యస్వామి, వాసుకిలవిగ్రహాలు, కిందభాగంలో శేషనాగువిగ్రహం ఉన్నాయి. ఈవిగ్రహాలకు నిత్యకర్మ ఆరాధన పూజలుజరుగుతాయి. పవిత్రత, ప్రాముఖ్యతవలన ఈఆలయము దినదిన ప్రవర్ధమానంచెందుతూ చాలావేగంగా అభివృద్ధి, ప్రజధరణ పొందుతున్నది. పురాణకధల ప్రకారము షణ్ముఖప్రభువు తారక, శూరపద్మసురఅను రాక్షసులనువారి అనుచరుల సమేతంగా సంహరించి తనసోదరుడు గణేషుణితో కలిసి కుమారపర్వతాన్ని చేరుకుంటారు. వారికి అక్కడఇంద్రుడు గొప్పఆహ్వానం పలుకుతాడు. రాక్షససంహారంవల్ల చాలాసంతోషంతోఉన్న ఇంద్రుడు, కుమారస్వామిని తనకుమార్తె దేవసేనను వివాహముచేసుకొమ్మని అడిగాడు. అందుకు కుమారస్వామి అంగీకరించగా, వారివివాహం కుమారపర్వతం పైన మార్గశీర్షమాసం శుద్ధశష్టినాడు జరిగింధి.. ఆవివాహంతోజరిగిన షణ్ముఖ పట్టాభిశేఖానికి దేవదేవులు బ్రహ్మ,విష్ణు, శివుడుమొదలైన దేవతలుహాజరై ఆశీర్వదించారు. కార్యక్రమానికి ప్రసిద్థ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకన్ని నిర్వహించారు. అలా పుణ్యనదుల కలియకనుంచి ప్రవహించినధార కుమారధారగా పిలవబడుచున్నది. గరుడునిధాడినుంచి తప్పించుకోవటానికి సర్పరాజు వాసుకి కుక్కేసుబ్రమణ్యక్షేత్రములో శివునిగురించి తపస్సు చేశాడు..వాసుకి తపస్సుకుమెచ్చిన శివుడు, షణ్ముఖుడిని తనభక్తుడు వాసుకికిఅండగా, తోడుగా ఉండమని తెలిపాడు.. అందుకే ఇచ్చట వాసుకిఅనబడు నాగరాజుకుకానీ చేయు పూజలు సుబ్రమణ్యస్వామికి చేసినట్లీ. శ్రీక్షేత్రం కుక్కేసుబ్రమణ్యఆలయంలో ఆశ్లేషబలిపూజ అను కాలసర్పదోషపూజ నిర్వహిస్తారు. సుబ్రమణ్యస్వామి కాలసర్పదోషము, కుజదోషములనుండి భక్తులకు రక్షణఇస్తాడు. ఆశ్లేషబలిపూజ ప్రతినెల ఆశ్లేషనక్షత్ర దినాలలో జరపబడుతుంది. పూజకుహాజరయ్యే భక్తులు సమయానుసారం దేవస్థానంలోపల సంకల్పంచేసే పురోహీతుడి ముందు హాజరుకావలెను. హోమపూర్ణహుతి పిమ్మట భక్తులకు ప్రసాదాలు అందచేయబడుతాయి. శ్రావణ, కార్తీక, మృగశిర మాసముయందు భక్తులు ఈపూజ విశిష్టముగా చేస్తారు. సర్పదోషమునుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈపూజచేస్తారు. ఈజన్మలోకానీ లేక గతజన్మలోకానీ, తెలిసికానీ, తెలియకకానీ పలుకర్మల వలన సర్పదోష బాధితులయినవారికీ పండితులు ఈసర్పదోషనివారణ పూజను విముక్తిమార్గంగా సూచిస్తారు. ఈ పుజను వ్యక్తికానీ, కుటుంబంతోకానీ, లేక పూజారి ఆద్వర్యంలో కానీ చేయవచ్చును. ఈపూజావిధానం ఒకవ్యక్తి మరణానంతరం జరిగే శ్రార్ధఖర్మలపూజవలె ఉంటుంది. సర్పసంస్కార పూజ చెయ్యదలిచినవారు రెండురోజులు సుబ్రమణ్య సన్నిధిలో ఉండవలెను. ఈపూజ సూర్యోదయసమయంలో చెయ్యబడుతుంది. ఆరోజు వేరే ఎటువంటి పూజలు చెయ్యకూడదు. పూజప్రారంభం నుంచి ముగింపువరకు దేవస్థానంవారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమేభుజించాలి. నలుగురుకి దేవస్థానంవారు భోజన మేర్పాటు చేస్తారు. ఆలయము ఉదయం 7-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు తిరిగి 3-30 నుండి 8-30 వరకు తెరచియుండును. బసకు దేవస్థానమువారి వసతిగృహములు మధ్యతరహానుండి ఉన్నతశ్రేణివరకు లభ్యమగును.

No comments:

Post a Comment