Friday, March 10, 2023

కుబేరుల కుటుంబంలో పుట్టిన ఆ ఆడపిల్ల దేశం కోసం భర్తనే కడతేర్చి, జైలు కెళ్ళి జీవన చరమాంకంలో పూలు కట్టుకుని, వాటిని అమ్ముకుని బ్రతికింది తప్ప ప్రభుత్వం ముందు చేయిచాచి అడుక్కోలేదు. అండమాన్ నికోబార్ జైలులో కాలాపానీ చెరసాలలో బంధీకృతమై నీరా ఆర్య

 🌹🍀🌹🍀🌹🍀🌹🍀👍☘️🌹☘️🌹

మహిళా దినోత్సవం కానుకగా రియల్ స్టోరి. 

వింటేనే ఒళ్లు గగుర్పొడిచే వీరవనిత కథ ఇది.


🌹🍀🌹🍀🌹🍀🌹🍀👍☘️🌹☘️🌹

కుబేరుల కుటుంబంలో  పుట్టిన ఆ ఆడపిల్ల దేశం కోసం భర్తనే కడతేర్చి, జైలు కెళ్ళి జీవన చరమాంకంలో పూలు కట్టుకుని, వాటిని అమ్ముకుని బ్రతికింది తప్ప ప్రభుత్వం ముందు చేయిచాచి అడుక్కోలేదు. అండమాన్ నికోబార్ జైలులో కాలాపానీ చెరసాలలో బంధీకృతమై దేశం కోసం తన యెదను కోయించుకుంది తప్ప తమ నాయకుడు బోస్ వాకబు విప్పలేదు. దర్జాగా కూర్చుని కాలుమీద కాలేసుకుని బ్రతకగల జీవితాన్ని కాదనుకుని దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆ వీరవనిత పేరు నీరా ఆర్యా. ఇలాంటి ఎందరో త్యాగధనుల రక్తం ధారపోస్తే లబించిన స్వాతంత్ర్యం నేడు బిచ్చం విదిలిస్తే లొంగిపోయే అప్రదిష్ట ప్రస్థానం చూస్తుండటం తీరని చేటు.


నీరా ఆర్య గురించి ఎం.వి.జి. ఆంజనేయులు గారి ఆడియో విన్నాక ఇలా ఎందరు ఉన్నారు అని మనసు అల్లాడి పోతుంది. స్త్రీ తన యెదను కోయించుకోవడం కన్నా భయంకరమైన శిక్ష ఏముంటుంది?. నీరా ఆర్య ఉత్తర ప్రదేశ్ వనిత. ధనవంతుల కుటుంబం. తండ్రి సేఠ్ జఠ్మల్. కలకత్తా లో చదువుకుంది. ఆమెకు యుక్త వయసు రాగానే బ్రిటిష్ ప్రభుత్వంలో సి.ఐ.డి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే శ్రీకాంత్ జయరాం దాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల ఆసక్తి పెరిగి రహస్యంగా ఝాన్సీ లక్ష్మి రెజిమెంట్ లో చేరి తన దేశ భక్తిని చాటుకుంది నీరా. అదే సుభాష్ చంద్రబోస్ ను పట్టుకునే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం ఆమె భర్తకు అప్పగించింది. విధి విచిత్రం అంటే ఇదేనేమో. దేశభక్తి నిండిన భార్య. దేశభక్తుల్ని పట్టించే ఉద్యోగ భర్త. ఈ క్రీడలో చివరకు భర్తను హతమార్చి జైలు పాలైన భార్య వీరవనిత నీరా...

🌹🍀🌹🍀🌹🍀🌹🍀👍☘️🌹☘️🌹

○ఎలాగంటే సుభాష్ చంద్రబోస్ ఆంతరంగిక సేనాని అయిన నీరా ఆర్య గురించి భర్తకు తెలిసింది. తనకు బోస్ ను పట్టించమని ఆమెను అడిగాడు భర్త. తాను ఎప్పటికీ అలా చేయనని తెగేసి చెప్పింది నీరా. అయితే ఆమెకు చెప్పకుండా ఓ రోజు రహస్యంగా వెంబడించి వెళ్ళాడు ఆ భర్త. సుభాష్ చంద్రబోస్ కారులో వెళ్తూ కనిపించగానే కాల్చేశాడు. బుల్లెట్టు బోస్ కి కాకుండా డ్రైవర్ కి తగలటంతో బోస్ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. తన భర్త ఆగడం పసిగట్టిన భార్య తక్షణం కత్తి దూసి అతని కుత్తుక కోసి ప్రాణాలు తీసేసింది. ఇది సాధ్యమా? దేశభక్తి అంత గొప్పది మరి. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో నీరా ఆర్య చేసిన ఈ తెగువ అసామాన్యమైనది. ఆమె చరిత్ర మరువలేనిది. బ్రిటిష్ ప్రభుత్వం ఆమె నేరాన్ని విచారించి జీవిత ఖైదు విధించింది. ఆమెను కాలాపానీ చెరసాలలో గొలుసులుతో కట్టి ఉంచారు. ఓ రోజు గొలుసులు తెంపే క్రమంలో సుత్తితో ఆమె కాలుపై కొట్టడంతో విలవిలలాడుతూ ఆ వ్యక్తిని తిట్టింది. దాంతో సుభాష్ స్థావరం ఎక్కడో చెప్పమని హింసించారు. తాను ససేమిరా చెప్పనని, ఆయన స్థావరం తన గుండెల్లో ఉందని చెప్పింది. అంతే మదించిన బ్రిటిష్ అధికారి ఆమె రొమ్ములు కోసేయమని ఆజ్ఞాపించాడు. చెట్టు కొమ్మలు నరికే రంపంతో ఆమె కుడి రొమ్ము కోసేశారు. రక్తం చిమ్ముతూన్న ఆమె యెద తెగి నేలపై పడింది. విలవిలలాడుతూ కుప్పకూలిన ఆమె దైన్యావస్థను చూసి పగలబడి నవ్వుకున్న బ్రిటిష్ దమనకాండ ఈ తరానికి ఎలా తెలుస్తుంది.

🌹🍀🌹🍀🌹🍀🌹🍀👍☘️🌹☘️🌹

 ఆమె ధైర్యం తెగువ చూసిన అక్కడి భారతీయ వైద్యులు ఆమెకు చికిత్స చేసి బ్రతికించారు. కాలాపానీ జైలులోనే నరక యాతన అనుభవించి, ‌స్వాతంత్ర్యం వచ్చాక ఆమె విడుదలైంది. మారిపోయిన దేశకాల పరిస్థితుల్లో ఆమె హైదరాబాద్ కు చేరుకుంది. చిన్న పూరె గుడిసె వేసుకుని పూలు అమ్ముకుని బ్రతికింది. ఆమె త్యాగం ఎవరికి పట్టలేదు. ఏ స్వాతంత్ర్య పింఛను పొందలేదు. రికమండేషన్ లెటర్స్ తో స్వాతంత్ర్య యోధుల జాబితాలో పేరు చేర్చుకుని చంకలు గుద్దుకున్న వంచకులు ఎందరో... కానీ విషాదం ఏమిటంటే ఆమె వేసుకున్న గుడిసె,  ప్రభుత్వ స్థలమని కూల్చేశారు. ఆమె ఎవరినీ దూషించలేదు. అలాగే గాలికి ధూళికి బ్రతికింది.  చివరికి 96 ఏళ్ల వయసులో ఆమె 1998 లో మరణించారు. ఈ కధనం మనలో జాలి పుట్టిస్తే అది పెదవి వట్టి విరుపు. దేశభక్తి నింపితే అది నిజమైన గట్టి మలుపు.  స్త్రీ జాతి ధైర్యసాహసాలకు, దేశభక్తికి, త్యాగనిరతికి నీరా ఆర్య జీవితం ఈ దేశంలో మహిళలందరికీ స్ఫూర్తి. 


🌹🍀🌹🍀🌹🍀🌹🍀👍☘️🌹☘️🌹

 మార్చి 5 జన్మించిన నీరా ఆర్య గురించి మహిళా దినోత్సవం రోజున తెలుసుకోవడం సముచితం. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల ఆనాడు దేశభక్తితో ఎందరో మహిళలు చేరి దేశానికి తమ సేవలందించారు. ఈనాడు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు దిగుతున్న మహిళలు ఈ కధ విన్నాక తమ జీవితాలను సరైన అవగాహనతో నడుపుకుంటారని ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటారని ఆశిద్దాం. 

🌹🍀🌹🍀🌹🍀🌹🍀👍☘️🌹☘️🌹


డాక్టర్ ఎమ్మెస్వీ సత్యనారాయణ బాబు (కపర్ది)

🌹🍀🌹🍀🌹🍀🌹🍀👍☘️🌹☘️🌹

Sunday, February 5, 2023

తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు*2023 February

 *తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు*2023 February 


ఆసరా పింఛన్లు 12,000 కోట్లు


దళిత బంధు 17, 700 కోట్లు


బీసీ సంక్షేమం 6,229 కోట్లు


గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు


కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు


బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు,


నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,


విద్యుత్ రంగం 12, 727 కోట్లు


ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.


ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు..


దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు


ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు..


గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు..


బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు..


వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు..


కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు..


షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు


పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు..


వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు..


విద్యా రంగానికి రూ.19,093 కోట్లు..


రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు..


హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు..


పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు..


రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు..


హోంశాఖకు రూ.9,599 కోట్లు..

మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు..


మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు..


రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు..


రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు..


కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు



2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు..


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు.


తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 రూ.2,90,396 కోట్లని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు హరీష్‌ రావు. అలాగే, బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, విద్యుత్ రంగం 12, 727 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు తెలంగాణ మంత్రి హరీష్‌ రావు.

పెన్షన్ తీసేసె హక్కు ఎవరిచ్చారు *ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మన జ్ఞానం పెరుగుతుంది.*

 పెన్షన్ తీసేసె హక్కు ఎవరిచ్చారు *ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మన జ్ఞానం పెరుగుతుంది.*

*ఇదీ భారతదేశ వ్యవస్థ!!*

 *మీరే చూడండి ....*

    సేకరణ:- పాల క పురుషోత్తం. 

1- ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలను కుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయ వచ్చు. 

కానీ అదే వ్యక్తి మాత్రం రెండు చోట్ల ఓటు వేయ లేరు.


2- ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు.

కానీ అదే వ్యక్తిరాజ కీయ నాయకుడు కావాలను కుంటే మాత్రం జైలులో ఉన్న ప్పుడు కూడా ఎన్నికల్లో పోటీచేయవచ్చు.


3-ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు,

కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడినా, ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, ప్రధాని లేదా రాష్ట్రపతి కూడా కావచ్చు


4- ఒక వ్యక్తి నిరాడంబర మైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 

కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ భారతదేశ ఆర్థిక లేదా విద్యా మంత్రి కావచ్చు.


5-ఒకవ్యక్తి సైన్యంలో చేరటానికి మేజర్ అయి ఉండాలి10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.

కానీ అదే వ్యక్తి నిరక్షరాస్యుడు, పిరికివాడు కుంటివాడు అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు.


6 ఒక వ్యక్తి వేలాది కేసులలో నిందితుడైన ప్పటికీ న్యాయ లేదా హోం మంత్రి కూడా కావచ్చు


ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా?

నాయకులు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండవద్దా?

కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావ డానికి మీమద్దతు ఇవ్వండి.


మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు ....

కాకపోతే, మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.


30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? 


కేవలం 5 సంవత్సరాలు కూడా  రాజకీయ పదవిలో లేకుండా పెన్షనా? 


ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్లా??


న్యాయం ఎక్కడ ఉంది ...?


శ్రీ డి. కె. శ్రీవాస్తవ

చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

బొంబాయి హైకోర్టు.

ముంబై .....

ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి తొలగించ వద్దు, ✊✊✊✊

తినకూడని పదార్థాలు : *వరి బియ్యం, గోధుమ, నాన్‌వెజ్, గుడ్లు, మైదా, టీ, కాఫీ, చక్కెర, (జెర్సీ) పాలు, ప్యాకేజ్డ్ మరియు జంక్ ఫుడ్స్, రిఫైన్డ్ నూనెలు, డ్రై ఫ్రూట్స్, సోయా, చాక్లెట్లు.

 తినకూడని పదార్థాలు :


*వరి బియ్యం, గోధుమ, నాన్‌వెజ్, గుడ్లు, మైదా, టీ, కాఫీ, చక్కెర, (జెర్సీ) పాలు, ప్యాకేజ్డ్ మరియు జంక్ ఫుడ్స్, రిఫైన్డ్ నూనెలు, డ్రై ఫ్రూట్స్, సోయా, చాక్లెట్లు.


తినవలసిన ఆహారం :


*మలబద్దకానికి కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ వేయించిన దానికంటే ఎక్కువ ఉడికించిన ఆహారాన్ని తీసుకోండి.


*నీరు మరియు ఫైబర్ అధికంగా ఉండే కాలానుగుణ సేంద్రీయంగా పెరిగిన పండ్లను తినాలి.


*రోజూ ఎక్కువగా గోరువెచ్చని నీరు త్రాగాలి.


*రాత్రి పడుకునే ముందు చెవిలో దూదిని పెట్టుకోవాలి.నేరుగా ఫ్యాన్ కింద నిద్రించరాదు.


*ఒక పెద్ద గిన్నెలో వేడి నీరు పోసి తలను టవల్ కప్పి ఉంచి ఆ వేడి నీటితో రోజుకు 3 లేదా 4సార్లు ఆవిరి పట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది.


*మెరుగైన రక్త ప్రసరణ కోసం చురుకైన నడక లేదా వ్యాయామం ప్రతిరోజూ చేయాలి.


 *ఎసి గదుల్లో ఉండడం మానుకోండి. ప్రకృతిలో సహజమైన వాతావరణానికి ప్రాధాన్యత ఇవ్వండి.


*రాత్రి భోజనం కచ్చితంగా 7 గంటల లోపు తినాలి. రాత్రి త్వరగా నిద్ర పోయి వేకువజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.


*ప్రతి అరగంటకు ఒక చిన్న కప్పు గోరు వెచ్చని నీరు త్రాగాలి.


* చిరు ధాన్యాలు ఒక్కోటి 2 రోజుల చొప్పున తీసుకోవాలి.

ఊదలు 

అరికలు 

కొర్రలు 

అండు కొర్రలు

సామలు  

*మీరు చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు.


*ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి

Acidity // Gastric // గ్యాస్ట్రిక్ // జీర్ణకోశమునకు సంబంధించిన // జీర్ణకోశ వ్యాధి

 Acidity // Gastric // గ్యాస్ట్రిక్ // జీర్ణకోశమునకు సంబంధించిన // జీర్ణకోశ వ్యాధి


బార్లీని ఒక స్పూన్ తీసుకుని బాయిల్ చేసి  మార్నింగ్ నైట్ తాగడం వల్ల గ్యాస్టిక్ సమస్య   తగ్గుతుంది. అదేవిధంగా ఓవర్ వెయిట్ ఉన్న వెయిట్ లాస్ అవుతారు.


రోజు ఒక కీరదోస తిన్నా కూడా గ్యాస్ట్రిక్ సమస్య తీరుతుంది.


రోజు ఉదయాన్నే పళ్ళు తోముకున్న తరువాత వేయించి పొడి చేసుకుని  జీలకర్ర  వాటర్ లో వేసి  మరిగించాలి తర్వాత ఆ నీటిని తాగి తినడం వలన కూడా గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.


ప్రతి ఉదయం, ఒక చెంచా పుదీనా రసం, అర టీస్పూన్ నిమ్మరసంతో పాటు ఒక చెంచా తేనె తీసుకోవాలి.

భోజనం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా ఇది తీసుకోవచ్చు.


*ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 1 గ్లాసు రాగిజావ తీసుకోవాలి.


*గ్లాసు మజ్జిగ లో 1 స్పూన్ సోంపు పొడి మరియు 1స్పూన్ వాము పొడి కలుపుకొని తీసుకోవాలి.


*చిన్న అల్లం ముక్క, సగం స్పూన్ మిరియాలు మరియు సగం స్పూన్ సోంపు గింజలు ఒక చిటికెడు ఉప్పు ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టి  వడ కట్టి తీసుకోవాలి.


*ప్రతీరోజు రెండు పూటలు భోజనం తరువాత 2 గ్రాముల పిపళ్ళ పొడిని, తగినంత తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే కడుపులో  మంట తగ్గుతుంది.


* కొద్దిగా పెరుగును తీసుకొని అందులో కీర దోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే కడుపులో ఏర్పడే మంటను తొలగిస్తుంది.


*అజీర్ణం మరియు ఆమ్లత్వం / గ్యాస్ట్రిక్ సమస్యలకు రాగులు ఎల్లప్పుడూ ఉత్తమమైన ఆహారం.

(రాగి జావ, రాగి సంగటి రోజు తీసుకోవాలి).


***పై వాటిలో మీకు అందుబాటులో ఉన్నవి వాడొచ్చు*****


*అన్నం(చిరుధాన్యాలు)/చపాతి (జొన్న,రాగులు ,సజ్జలు మాత్రమే)లోకి  కూరలు ఎక్కువగా తినాలి. 


*రెండు సార్లు భోజనం చేసి రాత్రి పూట కూరగాయలతో సలాడ్/ పండ్లు/రాగులు, సజ్జలు, జొన్నల తో చేసిన రొట్టెలు/ చిరుధాన్యాలతో చేసిన  గంజి, అంబలి తీసుకోవాలి. (


చిరు ధాన్యాలు వారానికి ఒక రకము చొప్పున తీసుకోవాలి.


ఊదలు 

అరికలు 

కొర్రలు 

అండు కొర్రలు

సామలు  


మీరు చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు. 


*రాత్రికి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలతో  చేసుకోవాలి. ( https://t.me/goodfoodhealthylife)


ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.


తినకూడని పదార్థాలు :


*వరి బియ్యం, గోధుమ, నాన్‌వెజ్, గుడ్లు, మైదా, టీ, కాఫీ, చక్కెర, (జెర్సీ) పాలు, ప్యాకేజ్డ్ మరియు జంక్ ఫుడ్స్, రిఫైన్డ్ నూనెలు, డ్రై ఫ్రూట్స్, సోయా, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తినకూడదు

మంచినీరు త్రాగడం* 👉జబ్బులు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మంచినీరు తగిన విధంగా తీసుకోవాలి...

 మిత్రులారా, పెద్దలారా,


అందరికీ శుభోదయం🙏


 *Dr ramchandra* గారి డైట్ షీట్ లో పాటించవలసిన

 *మొదటి నియమం* 


*మంచినీరు త్రాగడం*


👉జబ్బులు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మంచినీరు తగిన విధంగా తీసుకోవాలి...


మన శరీరంలో ఉన్న కోట్లాది కణాలలో పేరుకుపోయిన కెమికల్స్ ను శుభ్రపరచడంలోనూ,

మనం తీసుకున్న ఆహారాన్ని తగిన విధంగా జీర్ణం చేయడం లోనూ మంచినీరు ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది...


ఈ రెండు పనులు సరిగ్గా జరగకపోతే  

మన శరీరం అనేక జబ్బులకు కేంద్రంగా మారిపోతుంది.


అందుకని మనకి జబ్బులు తగ్గాలన్నా, ఆరోగ్యంగా మన శరీరం ఉండాలన్నా మంచినీరు తగిన విధంగా తీసుకోవాల్సిందే...


👉 *మంచినీరు తీసుకునే విధానం* 


1. ఉదయం లేవగానే రెండు గ్లాసులు త్రాగవలెను. గంట గ్యాప్ తర్వాత మరో రెండు గ్లాసులు నీళ్లు త్రాగవలెను...ఆ విధం గా ఉదయం లేవగానే గంట గాప్ లో *1 లీటర్* త్రాగవలెను.


2. ఉదయం టిఫిన్ చేసిన గంట తర్వాత నుండి, మధ్యాహ్నం భోజనం చేసే అరగంట ముందు వరకు ప్రతీ గంట కి గ్లాస్ (250ml)చొప్పున *1 లీటర్* నీళ్లు త్రాగవలేను...(మధ్యాహ్నం తినే అరగంట ముందు రెండు గ్లాసులు నీళ్లు త్రాగవలెను.)


3. Lunch చేసిన గంటన్నర తర్వాత నుండి 5 గంటలకి మధ్యలో ప్రతీ గంటకి గ్లాస్ చొప్పున *1 లీటర్* నీళ్లు త్రాగ వలెను ...


4. 5.30 గంటలకు (డిన్నర్ కి అర గంట ముందు) 2 గ్లాస్ ల వాటర్ త్రాగ వలెను ... *1/2 లీటర్* 


5. డిన్నర్ చేసిన గంట తర్వాత నిద్రపోయే ముందు వరకు మొత్తం గా 2 గ్లాస్ ల *1/2 లీటర్* నీళ్లు త్రాగవలెను...


👉 *కొన్ని సూచనలు:* 


A. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు త్రాగవలెను. మిగిలిన సందర్భాలలో నార్మల్ వాటర్ తాగవలెను.


B. 12 సంవత్సరాల లోపు వారు వాటర్ క్వాంటిటీ సగానికి తగ్గించి తీసుకోవలెను.


C. కిడ్నీ , గాల్ బ్లాడర్ లో stones వున్న వారు అదనం గా 1లీటర్ నీరు తీసుకోవాలి.


D. దగ్గు, జలుబు, ఆస్త్మా తో ఇబ్బంది పడుతున్నవారు గోరువెచ్చని నీరు తీసుకో వలెను...అలాగే ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 తర్వాత .... ప్రతీ అర గంటకి అర glass చొప్పున గోరు వెచ్చని నీరు త్రాగాలి...


E. Free motion కాని వారు కొన్ని రోజుల పాటు ఉదయం లేవగానే గంట గాప్ లో అదనం గా 1 లీటర్ వరకు తీసుకోవలెను...


F. కిడ్నీ లో creatinine ఎక్కువ గా వున్న వారు, లివర్ సిర్రోసిస్, క్యాన్సర్ పేషెంట్లు డాక్టర్ రామచంద్ర గారి సలహా మేరకు మాత్రమే వాటర్ తీసుకోవాలి...


👉 నీళ్లు త్రాగే విషయం లో చాలా మంది చేస్తున్న కొన్ని *పొరబాటులు* ...


1. పైన చెప్పిన విధంగా మంచినీరును మంచినీరు గా మాత్రమే తీసుకోవలెను.. వాటిలో ఇతరత్రా ఏమీ కలపరాదు... ఉదాహరణకు..తేనె నిమ్మకాయ రసం కలుపుకోవడం లేదా పసుపు కలుపుకోవడం జీలకర్ర ఇలాంటివి రెగ్యులర్గా తాగే వాటర్ లో కలపరాదు...విడి గా మీ ఇష్టం...


2. కూలింగ్ వాటర్(ఫ్రిడ్జ్ వాటర్) లేదా బాగా వేడిగా ఉన్న వాటర్ తాగరాదు..


3. ఏదైనా తింటున్నప్పుడు లేదా తిన్న వెంటనే నీళ్లు త్రాగరాదు...


4. మూత్రం పోయాల్సి వస్తుందని వాటర్ తాగకుండా ఉండడం అనేది సరి కాదు...


5. రోజుకి నాలుగు లీటర్లు తాగమన్నారు కదా అని ఉదయం 2 లీటర్లు, సాయంత్రం 2లీటర్లు ఒకేసారి ఇలా తాగడం చేయకూడదు...


6. నీరు ఎక్కువగా తాగిన తర్వాత మాత్రమే మోషన్ కి వెళ్లడం అనే అలవాటు చేసుకోకూడదు..


7. తప్పని పరిస్థితిలలో మినహా మినరల్ వాటర్ రోజూ తాగరాదు...


8. ఫ్లోరైడ్, సోడియం లేని బోరు వాటర్ గాని, పట్టణాలలో,గ్రామాలలో సరఫరా చేసే వాటరు గాని తాగడానికి ఆమోద యోగ్యమైనది....


9. దాహం వేస్తేనే నీళ్ళు త్రాగడం, అంతకుమించి తాగితే కిడ్నీలు పాడవుతాయనే అపోహ తొలగించుకోవాలి. 


10. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నీళ్లు తాగ కుండా వుండటం సరైనది కాదు....


పైన చెప్పిన సూచనలు, పొరబాట్లు గమనం లో వుంచుకొని మంచినీరు ని తగిన విధంగా తీసుకో గలరు.

 జబ్బులను జయించాలంటే, మొట్ట మొదటి అడుగు గా , గ్రూప్ లో వున్న వారందరూ మంచి నీరు నియమం పాటించండం, ఇతరుల చేత పాటించేలా చేయడం tద్వారా ఆరోగ్యం గా ఉండాలని కొరుకుంటున్నము

Saturday, February 4, 2023

పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తున్న భక్తులు జీవితాంతం శ్రేయస్సు సాధించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు

 పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తున్న భక్తులు జీవితాంతం శ్రేయస్సు సాధించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు


పద్మనాభ ద్వాదశి




పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజు పద్మనాభ ద్వాదశి జరుపుకుంటారు. విష్ణువును ఈ పవిత్రమైన రోజున అనంత పద్మనాభ పూజలు చేస్తారు. పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తున్న భక్తులు జీవితాంతం శ్రేయస్సు సాధించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.


పద్మనాభ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత:

పద్మనాభ ద్వాదశిని గమనించడం ఒక వ్యక్తి విముక్తి పొందటానికి సహాయపడుతుంది. విష్ణువు యొక్క బలమైన భక్తులు అనంత పద్మనాభంలోని ఏకాదశి మరియు ద్వాదశిపై పూజలు మోక్షాన్ని పొందటానికి సహాయపడతాయని నమ్ముతారు.


విష్ణువు మోక్షాన్ని పొందడంలో సహాయపడటంతో అత్యంత ప్రియమైన దేవుడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు ప్రాపంచిక ఆనందాల కోసం భక్తులు ఆయనను ప్రార్థిస్తారు.విష్ణువు యొక్క అనుచరులు ప్రపంచాన్ని త్యజించడాన్ని నమ్మరు. వారు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలని మరియు విష్ణువును ఆరాధించడం ద్వారా మరియు మంచి పనులు చేయడం ద్వారా స్వర్గానికి తమ మార్గాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారు.



వరహ పురాణంలో పద్మనాభ ద్వాదశి వ్రతం ప్రస్తావించబడింది. ద్వాదశి రోజు ఉదయం నుండి భక్తులు ఈ వ్రతాన్ని పరిశీలించి తమ కాఠిన్యాన్ని ప్రారంభిస్తారు.


కర్మ స్నానం చేసిన తరువాత భక్తులు విష్ణువు విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగించి భక్తులు విష్ణువుకు నీరు, పువ్వులు, బెట్టు ఆకులు, స్వీట్లు, పండ్లు, పసుపు, గంధపు పేస్టులను అందిస్తారు.


పువ్వులు మరియు లైట్లతో అందంగా విష్ణు ఆలయాన్ని అలంకరింపచేసి తరవాత స్వామిని సందర్శిస్తారు. దేవతలను అర్చించడం, గౌరవించడం, పూజించడం మొదలగునవి పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు.


చనిపోయిన ప్రియమైనవారికి నివాళులర్పించడానికి కూడా ఈ వేడుక చేయవచ్చు. భక్తులు విష్ణువుకు అంకితం చేసిన గ్రంథాలను చదువుతారు, ఆయన ప్రశంసలలో శ్లోకాలు పాడతారు మరియు రోజంతా ఆయన పేర్లతో మధ్యవర్తిత్వం చేస్తారు.


భక్తులు కూడా రాత్రి జాగరణ చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారు. ఆచారాలను ఉదయం మరియు రాత్రి రెండింటిలోనూ చేయవచ్చు. పేద ప్రజలకు భిక్ష మరియు ఆహారాన్ని అందిస్తారు.