Saturday, February 4, 2023

వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది బీజాక్షరాలు.....

 వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది


బీజాక్షరాలు.....




వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది. అది పఠించటము వలన సాధకునకు సకారాత్మక శక్తి(Positive energy) కలుగును. పఠించిన కొలది ఆ సకారాత్మక శక్తి క్రమ క్రమముగా వృక్షము మాదిరి వృద్ధి చెందుతుంది. బీజ మంత్రములు అనేవి స్పందనలు. ఆత్మ యొక్క పిలుపులు. సృష్టి ఆరంభములోని స్పందనలు బీజాక్షర మంత్రములే. తొమ్మిది శబ్దముల వరకు ఉన్నది బీజ మంత్రము, తొమ్మిదికి మించిన యడల మంత్రము అని, ఇరువది శబ్దములను మించిన మహా మంత్రము అని అంటారు.


అసలు సృష్టి ఆరంభములోని ప్రథమ స్పందన ‘ఓం’. అనగా ‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది. అవియే ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’ అనే బీజాక్షరములు. సంగీతములో కూడా ప్రథమముగా ఉన్నది ‘ఓం’ మాత్రమె. అది క్రమముగా ‘స’, ‘రి’, ‘గ’, ‘మ’, ‘ప’, ‘ద’, ‘ని’, గా ఉత్పత్తి చెందినది. వేణువు ఊదినప్పుడు వచ్చు మొదటి శబ్దము ‘ఓం’ మాత్రమె... యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజములుగా ఉత్పత్తి చెందినది.


ఓం...

‘ఓం’ మంత్రము త్రిమూర్తులు అనగా సృష్టి (బ్రహ్మ) లేదా ‘అ’ కారమునకు, స్థితి(విష్ణు) లేదా ‘ఉ’ కారమునకు, మరియు లయ (మహేశ్వర) లేదా ‘మ’ కారమునకు, లకు ప్రతీక. ‘అ’ కారము, ‘ఉ’ కారమునకు, మరియు ‘మ’ కారము మూడు కలిసినదే ఓం కారము.


‘అ’ కారము ఋగ్వేదమునకు,

‘ఉ’ కారము సామవేదమునకు,

‘మ’ కారము యజుర్వేదమునకు ప్రతీక.

సృష్టి (బ్రహ్మ), స్థితి(విష్ణు) మరియు లయ (మహేశ్వర) మూడింటిని కలిపి మాయ అంటారు.


క్రీం లేదా ధం లేదా క్షం లేదా లం...

ఇది కాళీ మాత మరియు కుబేర బీజాక్షరము. ఈ బీజాక్షర ఉచ్చారణ మూలాధార చక్రములో చేయవలయును. మూలాధార చక్రము పృథ్వీ తత్వమునకు ప్రతీక. తద్వారా ఇచ్ఛాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, బలము, అన్ని విధముల సఫలత, మరియు నకారాత్మక శక్తుల నుండి రక్షణ లభించును.



శ్రీం లేదా వం...

ఇది మహాలక్ష్మి బీజ మంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ స్వాధిష్ఠాన చక్రములో చేయవలయును. స్వాధిష్ఠాన చక్రము వరుణ తత్వమునకు ప్రతీక. తద్వారా క్రియాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, అంగములలో బలము, మూత్ర పిండములు, చర్మము వ్యాధుల నుండి రక్షణ, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి.


బీజాక్షరాలు వాటి వివరణ

బీజాక్షర సంకేతములు

ఓం - ప్రణవము సృష్టికి మూలం

హ్రీం - శక్తి లేక మాయా బీజం

ఈం - మహామాయ

ఐం - వాగ్బీజం

క్లీం - మన్మధ బీజం

సౌః - సౌభాగ్య బీజం

ఆం - పాశబీజం


క్రోం - అంకుశము

హ్రాం - సూర్య బీజం

సోం, సః - చంద్ర బీజం

లం - ఇంద్ర బీజం, పృథివీ బీజం

వం - వరుణ బీజం,జల బీజం


రం - అగ్ని బీజం

హం - ఆకాశ బీజం, యమ బీజం

యం - వాయు బీజం

శం -ఈశాన్య బీజం, శాంతి బీజం

షం , క్షం - నిరృతి బీజము


సం - సోమ (కుబేర) బీజము

జూం - మృత్యుంజయ, కాల భైరవ బీజం

భం - భైరవబీజం

శ్రీం - లక్ష్మీబీజం

హ్సౌ - ప్రాసాద , హయ గ్రీవబీజం


ఖేం - మారణబీజం

ఖట్ - సంహారబీజం

ఫట్ - అస్త్రబీజం

హుం - కవచబీజం వషట్ వశీకరణము బీజం


వౌషట్ - ఆవేశబీజం

ష్ట్రీo - యమబీజం

ధూం -ధూమావతిబీజం

క్రీం - కాళీబీజం

గం - గణపతిబీజం


*గ్లౌం వారాహి - గణపతిబీజం

ఘే - గణపతిబీజం

త్రీం -తారా బీజం

స్త్రీo - తారాబీజం

హూం - కూర్చము, క్రోధము, ధేనువు


బ్లూం - సమ్మోహనము

ద్రాం -ద్రావణ, దత్తాత్రేయ బీజం

ద్రీo - ఉద్దీపనం

దం - దత్తాత్రేయబీజం

అం - బ్రహ్మ బీజం


కం -బ్రహ్మబీజం

ఇం - నేత్రబీజం

ఉం - శ్రోత్రబీజం

హ్లీం - బగళాబీజం

గ్రీం - గణపతిబీజం


ఠ - స్థంభనము

హిలి - వశీకరణ, దేవతాభాషణం

కిలి కిలి - దేవతాభాషణం

చులు - బాధా నివారణ

హులు - బాధా నివారణ

No comments:

Post a Comment